MP Raghuramakrishna Raju : రాజీనామా పై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి.

 Mp Raghuramakrishna Raju : రాజీనామా పై ఎంపీ రఘ�-TeluguStop.com

ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నేతలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేస్తుంది.“టీడీపీ.జనసేన.బీజేపీ” పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.2024 ఎన్నికలకి సంబంధించి ఏపీలో 2014 పొత్తుల వాతావరణం కనిపిస్తుంది.2014 కంటే ఇప్పుడు రాష్ట్రంలో కొద్దిగా కాంగ్రెస్ బలపడటంతో పాటు షర్మిల అధ్యక్షురాలు కావడంతో.ఆ పార్టీకి ప్లస్ అయ్యింది.

ఈ క్రమంలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడానికి రెడీ అవుతోంది.

ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్నాయి.ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది.పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghuramakrishna Raju ) కీలక వ్యాఖ్యలు చేశారు.

నేడో రేపో వైసీపీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేయడం జరిగింది.ఈనెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలియజేశారు.

వచ్చే ఎన్నికలలో కూటమి తరపునే నరసాపురం పార్లమెంటు( Narasapuram Parliament ) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.ఏ పార్టీ నుంచి పోటీ చేసేది అనేది త్వరలో చెబుతానని వెల్లడించడం జరిగింది.2019 ఎన్నికలలో నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడం జరిగింది.

ఈ క్రమంలో 2024 ఎన్నికలలో “తెలుగుదేశం జనసేన బీజేపీ” కూటమి నుండి పోటీ చేయబోతున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube