జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలు చూశారా... వైరల్ అవుతున్న వీడియో!

మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో పని చేస్తూ అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కెవ్వు కార్తీక్( Kevvu Karthik ) గత నెల తాను ప్రేమించిన అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలను గెటప్ శ్రీను ( Getup Srinu )సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇక కెవ్వు కార్తిక పెళ్లికి ముందే తనకు కాబోయే అమ్మాయిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ విధంగా తన కాబోయే భార్య ఫోటోలను షేర్ చేసిన ఈయన మరో రెండు రోజులకే తనను వివాహం చేసుకున్నారు.

ఇలా జూన్ 9వ తేదీ అత్యంత సన్నిహితులు సెలబ్రిటీల సమక్షంలో కెవ్వు కార్తీక్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.తాజాగా కెవ్వు కార్తిక్ తన వెడ్డింగ్ వీడియోని ( Wedding Video ) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు మా పెళ్లి సందడి అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో వధూవరులు ఇద్దరు పట్టు వస్త్రాలను ధరించి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ వివాహ వేడుకను జరుపుకున్నట్టు తెలుస్తుంది.

కార్తీక్ వివాహం తెలంగాణ, మొయినా బాద్ లో ఉన్న రాయల్ లీషా కన్వెన్షన్స్ లో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈయన వివాహం ఎంతో ఘనంగా జరిగినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.వీడియో చివర్లో కార్తీక్ తన భార్యతో కలిసి అందరి బ్లెస్సింగ్స్ కోరుకోవడం జరిగింది.

Advertisement

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్, ఫ్యాన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక కార్తీక్ బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నారు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు