టాలీవుడ్ కు ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తూ ఉంటారు.పోతూ ఉంటారు.
అయితే అందులో కొంత మంది మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారు.మరి టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యి గుర్తింపు పొందిన హీరోయిన్ లలో కేతిక శర్మ ఒకరు.
ఈమె రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన ఈమె నటించి మొదటి సినిమాతోనే తన అందాలతో యువతను ఆకట్టుకుంది.
ఈమె అందాలకు కుర్రకారంతా ఫిదా అవుతారనే చెప్పాలి.ఇక ఈ సినిమా హిట్ అవ్వక పోయిన మరో అవకాశాన్ని అందుకుంది. నాగ శౌర్య లక్ష్య సినిమాలో కూడా కేతిక శర్మ కనిపించింది.అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకుంది లేదు.
అసలు ఈ సినిమా వచ్చింది అని చాలా మందికి తెలియదు.అయితే ఈమె అదృష్టం బాగుంది అనే చెప్పాలి.
ఎందుకంటే రెండు సినిమాలు హిట్ కాకపోయినా మూడవ సినిమాలో అవకాశాన్ని అందుకుంది.మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ తేజ్ ఒకరు.ఈయన ప్రెజెంట్ నటిస్తున్న సినిమా ‘‘రంగరంగ వైభవంగా’‘.ఈ సినిమా ఈయనకు కూడా మూడవ సినిమా.
గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా వైష్ణవ్ మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగాసెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో టీమ్ అంతా బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కేతిక శర్మ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది.తాజాగా ఈమె పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది.ఈమె ఈ సినిమాలో చేసిన పాత్ర చాలా నచ్చిందని.కెరీర్ పరంగా ఈమెకు ప్లస్ అవుతుంది అని చెప్పుకొచ్చింది.మరి ఈ అమ్మడు ముచ్చటగా మూడవ సినిమాతో అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి.







