యన్ టి ఆర్ జిల్లా నందిగామ: మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు… తాను పోటీ చేయనని ఎప్పుడూ చెప్పలేదు పోటీ చేయననే వీడియో ఉంటే చూపించండి అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించిన ఎంపీ కేశినేని నాని. మీడియా మీడియా బాధ్యత సరిగ్గా నిర్వర్తించడం లేదు.
నాలుగు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పంచే వారికే మీడియా సపోర్ట్ చేస్తుంది.భారత దేశం లో ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ లో బస్సుల వ్యాపారం లో చక్రం తిప్పిన నేను ఒక అవినీతి అధికారి అన్న మాటకు నా వ్యాపారం వదులుకున్నా చరిత్ర నాది.
దేశం లో నేను చేసినన్ని పనులు ఏ ఎంపీ చేయలేదు.తాను పోటీ చేయాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు.
ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తారు.చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది?.
లగడపాటి దుర్గ గుడి ఫ్లైఓవర్ అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపించా.రతన్ టాటా నా స్నేహితుడు అది చాలు….? రతన్ టాటా నన్ను అభిమానించే వ్యక్తి తాను ఏది చేయమంటే అది చేస్తాడు.ఢిల్లీ స్థాయి నాయకుడిని అయిన నన్ను మీడియా గల్లి స్థాయిలో చూపించాలని చూస్తుంది.
నిస్వార్థంగా పని చేసే వాళ్ళు ఎవరు మనుషులను చంపి వార్తల్లోకి ఎక్కరు.ప్రజలకు దానం చేసే వాడు సైలెంట్ గా చేస్తాడు రతన్ టాటా ఎన్ని మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నాడా అని సూటి ప్రశ్న.
ఫౌండేషన్లు , ట్రస్ట్ లు ఎన్నికల ముందు వచ్చేవే ఎన్నికల అనంతరం కనపడవు.ఎవరో చీరలు, ట్రై సైకిళ్లు పంచితే దాన కర్ణులు అవ్వరు వారి ప్రయోజనాల కోసం పార్టీ లో నలుగురికీ డబ్బు ఇచ్చి జిందాబాద్ లు కోట్టించుకుంటారు.
బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించా అయిన విజయవాడ అభివృద్ధి చేశా దటీజ్ కేశినేని నాని.