కేశవ మూవీ రివ్యూ

చిత్రం : కేశవ

 Keshava Movie Review-TeluguStop.com

బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత : అభిషేక్ నామా

సంగీతం : సన్ని ఎమ్ ఆర్

విడుదల తేది : మే 19, 2017

నటీనటులు – నిఖిల్, రిటూ వర్మ, ఇషా కొప్పికర్

వైవిద్యభరితమైన సినిమాలు చేసే నటుడు నిఖిల్.వరుసగా హిట్లు పడుతున్న స్టార్ డమ్ మోజులో మాస్ సినిమాలు చేయట్లేదు, లవ్ స్టోరిలతో సేఫ్ గేమ్ ఆడట్లేదు.

సినిమా సినిమాకి కథల ఎంపికలో వర్సటాలిటి చూపిస్తున్న నిఖిల్, ఈసారి రివేంజ్ డ్రామా కేశవతో మనముందుకి వచ్చాడు.కేశవ అద్యంతం ఎలా సాగిందో చూడండి.

కథలోకి వెళితే :

కేశవ్ (నిఖిల్) అమ్మనానలు ఓ యాక్సిడెంటులో చనిపోవడంతో కథ మొదలవుతుంది.ఇతనిది ఓ వింత సమస్య.

గుండె కుడివైపుకు ఉంటుంది.దాంతో అత్యుత్సాహం, భావోద్వేగాలకు తట్టుకోలేడు.

ఏ పని చేసినా కూల్ గా చేయాలి.అది మర్డర్ అయినా సరే.తనకున్న సమస్య వలన తన ఉద్వేగాల వేడి తగ్గాక తన తల్లిదండ్రులని చంపినవారి వేట మొదలుపెడతాడు కేశవ్.అతడికి తన పరిమితుల్లో సహాయం చేస్తూ ఉంటుంది సత్యభామ (రిటువర్మ)

ఇక ఈ కేశవ్ ని పట్టుకోవడానికి వచ్చే స్పెషప్ ఆఫీసర్ షర్మీలా (ఇషా కొప్పికర్).షర్మీలా కేసు టేకప్ చేసాక కూడా కేశవ్ దూకుడు కొనసాగిందా? కేశవ్ తల్లిదండ్రులు చనిపోవడానికి అసలు కారకులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడండి.

నటీనటులు నటన :

నిఖిల్ చేసిన అన్నిపాత్రల్లోకి ఇది డిఫరెంట్ పాత్ర.ఎందుకంటే కేశవ్ మాట్లాడేది తక్కువ.జరుగుతున్న విషయాలకి రియాక్ట్ అయ్యేది తక్కువ.సబ్టిల్ గా ఉంటూనే తనలో రగులుతున్న పగను చూపించాలి.లోలోనే అన్ని అణచుకోవాలి.

అన్నిపనులు సక్రమంగా చేసాడు నిఖిల్.నిఖిల్ ఇంటెన్సిటి ఉన్న పాత్రలు కూడా బాగా చేయగలడు అని నిరూపించుకున్నాడు.

రిటూ వర్మ స్క్రీన్ మీద చేయడానికి పెద్దగా ఏమిలేదు.కాని తెలుగురాని హీరోయిన్లు కన్నా నేచురల్ గా అనిపించే రీటూ నూరుపాళ్ళు నయం.తన అభినయం బాగున్నా, టాలెంట్ ఉన్న నటికి సరిపడా క్యారక్టర్ రాసుకోలేదని సరిపెట్టుకోవమే.ఇషా కొప్పికర్ నటన సూపర్బ్ అనలేం కాని, బాగా చేసింది.

అనసూయ డబ్బింగ్ చెప్పకుండా, ఇషానే సొంతంగా మాట్లాడితే ఆ పాత్ర ఇంకా బాగా పండేది.రావు రమేష్ ఒకే.ప్రియదర్శి, వెన్నెల కొషోర్ కొన్ని నవ్వులు పూయించారు.

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రాఫీ సూపర్.దివాకర్ మణి కొన్ని సీన్స్ లో వాడిన కలర్స్‌ మనం సాధారణంగా తెలుగు సినిమాల్లో చూసేవి కావు.బర్డ్ వ్యూ యాంగిల్స్ కొన్ని సీన్స్ కి చక్కగా కుదిరినా, అలాంటి షాట్స్ మరీ ఎక్కువ పెట్టేసారేంటో.

ఓవరాల్ గా అయితే సినిమాటోగ్రాఫర్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.సన్ని అందించిన బాణిలు మెదడులో రిజిస్టరు అవకపోవచ్చు కాని, సినిమా మూడ్ కి మాత్రం సరిపోతాయి.

క్లయిమాక్స్ ముందు వచ్చే శ్లోకం బిట్ సీన్ లో పెద్దగా విషయం లేకున్నా బాగా ఎలివేట్ చేస్తుంది.ఎడిటింగ్ డిపార్టుమెంటు బాగా కష్టపడ్డారు.సినిమా నిడివి అటుఇటుగా రెండే గంటలు.అయినా, ఇంకా కత్తిరించాల్సిన సన్నివేశాలు ఉంటాయి.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

ఫాంటసీ సినిమాల్లో ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా ప్రేక్షకులు పట్టించికోరు.బాహుబలినే తీసుకోండి .ఒక అమ్మాయిని ఊహించుకుంటూ ఆకాశాన్ని అంటే కొండను శివుడు ఎందుకు ఎక్కుతాడు అని మనం అడగగలమా? ఆ జానర్ కి అలాంటి సినిమాటిక్ లిబర్టీ ఉంటేనే కిక్కు.కాని థ్రిల్లర్స్ లో చిన్న పాయింట్ కూడా సినిమాటిక్ గా అనిపించకూడదు.అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.కేశవ విషయానికి వస్తే సినిమాటిక్ లిబర్టీ ఎక్కవయిపోయింది.ముఖ్యంగా సెకండాఫ్ .నిఖిల్ తప్ప ఇంకో పాత్రలో బలం, బరువు ఉండదు.నిఖిల్ ఇష్టం వచ్చినప్పుడు మర్డర్ చేస్తాడు.

పెద్ద సంఘర్షణ ఉండదు.అలాంటప్పుడు ఆసక్తి ఎలా పుడుతుంది? అదీకాక ఇరికించిన లాజిక్కులు, ట్విస్టులు.గజినీ, ఐ .ఇప్పుడు కేశవ.ఇలాంటి రివేంజ్ డ్రామాలు మనకు కొత్త కాదు.అలాంటప్పుడు ఎంత పకడ్బందీగా కథనం రాసుకోవాలి .కాని అది జరగలేదు.మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్లు సరిగా ఉడకని కథనాన్ని ఇంకా దెబ్బతీస్తాయి.

అలాగని కేశవ బ్యాడ్ మూవీ కాదు, మన అంచనాలను అందుకోలేకపోయిన సినిమా.దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుధీర్ వర్మ.

నిఖిల్ మీద నమ్మకం ఉన్నవారు ఓసారి వెళ్ళి చూడచ్చు.బోర్ కొట్టదు .అలాగే థ్రిల్ ని కూడా ఇవ్వదు.

ప్లస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్

* సినిమాటోగ్రాఫీ

* నిఖిల్ పెర్ఫార్మెన్స్

* సంగీతం

మైనస్ పాయింట్స్ :

* బలహీనమైన ప్రతినాయకులు

* ఇరికించిన కామెడీ సీన్లు

* ఒక ట్రాక్ మీద నిటారుగా వెళ్ళని స్క్రీన్ ప్లే

* సినిమాటిక్ లిబర్టీ

* మొత్తం మీద సెకండాఫ్

చివరగా :

ఉడికిఉడకని కేశవ

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube