తిరువనంతపురంలోని విజింజమ్‌కు చెందిన మత్స్యకారుల బృందానికి తాజాగా 28 కోట్ల రూపాయల విలువైన తిమింగలం అంబర్‌గ్రిస్ లేదా వాంతి దొరికింది.ఒక మైనపు పదార్థంలా ఉండే ఈ తిమింగలం వాంతిని ఖరీదైన పర్‌ఫ్యూమ్, మెడిసిన్స్ లో విరివిగా వాడతారు.
ఈ పదార్థం అనేది తిమింగలాలు జీర్ణించుకోలేక సముద్రంలోనే కక్కుతాయి.అలా వాంతి చేసుకున్న ఈ పదార్థం నీటిలో తేలుతున్న బంగారంలా మారుతుంది.
నిజానికి ఇది బంగారం కంటే విలువ ఎక్కువే.
వివరాల్లోకి వెళితే.కేరళలోని ఒక సముద్రంలో 28.4 కిలోల తిమింగలం వాంతిని మత్స్యకారులు గుర్తించారు.అనంతరం శుక్రవారం సాయంత్రం ఒడ్డుకు తీసుకొచ్చారు.ఆపై తీరప్రాంత పోలీసులకు అప్పగించారు.ఎందుకంటే ఇండియాలో ఈ పదార్థం అమ్మటం నిషేధం.దీనిపై పోలీసులు స్పందిస్తూ “మత్స్యకారులు మాకు అంబర్‌గ్రిస్‌ను అప్పగించారు.
మేం అటవీ శాఖకు సమాచారం అందించాం.వారు దీనిని మా నుంచి స్వాధీనం చేసుకున్నారు” అని కోస్టల్ పోలీసులు చెప్పారు.

ఇది అసలైనదా?? కాదా?? అనేది నిర్ధారించేందుకు అటవీ శాఖ అంబర్‌గ్రిస్‌ను తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి తరలించింది.సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే ఒక కిలో అంబర్‌గ్రిస్ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయలు పలుకుతుందట.అయితే స్పెర్మ్ వేల్ అనేది వన్యప్రాణి సంరక్షణ చట్టం క్రింద సంరక్షించడాన్ని భారత ప్రభుత్వం బాధ్యతగా పెట్టింది.ఇది అంతరించిపోతున్న జాతి కాబట్టి, భారతదేశంలో చట్టం ద్వారా అమ్మకం నిషేధించబడింది.
విదేశాల్లో మాత్రం దీనిని అమ్ముకోవచ్చు.







