కేరళ కర్ణాటకల మద్య సరిహద్దు గొడవ

దేశాల మద్య సరిహద్దులు విధించుకున్నాం.

కాని కరోనా కారణంగా రాష్ట్రాలు, జిల్లాలు చివరకు గ్రామాల మద్య కూడా సరిహద్దు ఏర్పాటు చేసుకుని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంకు రాకపోకలను పూర్తిగా నిషేదించడం జరిగింది.

ప్రస్తుతం తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల వారు ఎవరు రావడం లేదు.అలాగే ఇతర ప్రాంతాలకు తెంగాణ వారు వెళ్లడం లేదు.

War Between Kerala And Karnataka Border Issue, Corona Virus, Kerala High Court,

ఇదే పరిస్థితి కేరళ ఇంకా కర్ణాటక మద్య కొనసాగుతోంది.ఈ రెండు రాష్ట్రాల మద్య రాకపోకలు పూర్తిగా నిలిపేశారు.

అయితే ఇది కేరళకు ఇబ్బంది దాయకంగా మారిందట.కేరళ హైకోర్టుకు ఇప్పటికే కర్ణాటకకు వెళ్లే జాతీయ రహదారిని ఓపెన్‌ చేయాలని కేరళ ప్రభుత్వం వెళ్లింది.

Advertisement

కేరళ హైకోర్టు కర్ణాటక ప్రభుత్వంకు రాకపోకలు జరపాల్సిందే, తప్పకుండా రాకపోకలు ఉండాని పేర్కొంది.కేరళ హైకోర్టు నిర్ణయంపై కర్ణాటక సుప్రీం కోర్టుకు వెళ్లింది.

ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిహద్దులను తెరిచేది లేదు అంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తుంది.ఈ సమయంలోనే సరిహద్దు మూసి వేయడం వల్ల కేరళలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు అలాగే నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా కేరళ వాదిస్తుంది.

ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రెండు రాష్ట్రాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు.రాష్ట్రాల మద్య ఈ తగాధ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు