మహానటితో పోటీకి రెడీ అయిన శర్వా

టాలీవుడ్‌లో వేసవిలో ఈ సమయానికి చాలానే సినిమాలు రిలీజ్ కావాల్సింది.కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది.

దీంతో సినిమా రంగానికి చెందిన అన్ని పనులు వాయిదా పడ్డాయి.ఈ క్రమంలో చాలా సినిమాలు రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి.

Keerthy Suresh, Sharwanand, Miss India, Sreekaram-మహానటితో ప�

ఇక లాక్‌డౌన్ తరువాత వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు పలు చిత్రాలు రెడీ అవుతున్నాయి.ఈ జాబితాలో వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఉప్పెన, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, లవ్ స్టోరీ వంటి సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మిస్ ఇండియా, యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.అయితే ఈ రెండు సినిమాలో లాక్‌డౌన్‌ తరువాత ఎప్పుడు రిలీజ్ అయినా పోటీ పడటం ఖాయమని తెలుస్తోంది.

Advertisement

ఈ చిత్రాల నిర్మాతల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ఈ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చినా పోటీ పడటం ఖాయం.మరి ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో తెలియాలంటే మాత్రం అవి రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు