Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా.. చెల్లి రోల్ లో నటిస్తే సినిమా ఫ్లాపా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన భోళాశంకర్ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావించారు.

ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి సంబందించి ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ అవుతోంది.ఈ ఫ్లాప్‌కి హీరోయిన్ కీర్తి సురేశ్( Keerthy Suresh ) కూడా ఒక కారణమని అంటున్నారు.

స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్లకు చెల్లెలు క్యారెక్టర్ లలో కూడా నటిస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్( Chiranjeevi Sister Role ) లో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలకు ముందే చాలామంది కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది అంటే ఆ సినిమా ఫ్లాప్ అవడం గ్యారెంటీ అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ముందుగా అనుకున్నట్టుగానే జరిగింది.

కీర్తి సురేశ్ చెల్లిగా చేయడం చిరుకి కలిసిరానట్లే, సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అస్సలు కలిసిరాలేదు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే( Annaatthe ) లో కిర్తి సురేష్ చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే.

దాంతో ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.తాజాగా జైలర్ సినిమా( Jailer Movie )తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు రజినీకాంత్( Rajinikanth ).

మొత్తానికి కీర్తి సురేష్ హీరోలకు చెల్లెలుగా నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం గ్యారెంటీ అన్న వాదన ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది.కీర్తి సురేష్ హీరోలకు చెల్లెలుగా( Heroes Sister Role ) నటిస్తుంది అంటే ఆ హీరోల సినిమాలకు ముప్పే అని అంటున్నారు.అందుకు భోళా శంకర్,అన్నాత్తే సినిమాలు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకొస్తున్నారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అంతేకాకుండా భోళా శంకర్ సినిమాకు ముందు ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు.ఇప్పుడు అదే విషయం మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు