మొదటిసారి లవ్ స్టోరీ బయటపెట్టిన కీర్తి సురేష్.. ప్రామిస్ రింగ్ తొడిగాడంటూ!

మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

డిసెంబర్ 12వ తేదీ ఈమె గోవాలో తన ప్రేమికుడు ఆంటోనీ తట్టిల్( Antony Thattil ) తో వివాహం జరుపుకొని ఏడడుగులు నడిచారు.

ఇలా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.ఇకపోతే మొదటిసారి ఇవే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ స్టోరీ ( Love story ) మొత్తం బయట పెట్టేశారు.

ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ తాను 12వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆంటోని తనకు పరిచయం అయ్యాడని తెలిపారు.తను వయసులో నాకంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడు.

తనతో ప్రేమలో ఉన్నప్పుడు నా వయసు 15 సంవత్సరాలు మాత్రమే నని కీర్తి సురేష్ తెలిపారు.

Advertisement

మొదటిసారి తాను నాకు 2010వ సంవత్సరంలో పరిచయం అయ్యాడు.ఆ సమయంలోనే ఆయన నాకు ఒక ప్రామిస్ రింగ్ తోడిగారని ,ఆ రింగును సినిమాలలో కూడా గమనిస్తే కనిపిస్తుందని తెలిపారు.పెళ్లి జరిగే వరకు తాను తీయలేదని కీర్తి సురేష్ తెలిపారు.

ఇక నేను ఆంటోనీ ఇద్దరు కూడా మా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడము అందుకే మా ప్రేమ విషయం కూడా ఎవరికీ తెలియకూడదని జాగ్రత్త పడ్డాము కానీ విజయ్, సమంత, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్ ( Vijay, Samantha, Atlee, Priya, Priyadarshan )వీరికి మాత్రమే మా ప్రేమ గురించి ముందుగా తెలుసని కీర్తి సురేష్ తెలిపారు.

2016 వ సంవత్సరం నుంచి మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిందని తెలిపారు.మొదటిసారి నేను ఆంటోనీ కలిసి 2017 వ సంవత్సరంలో విదేశాలకు వెకేషన్ వెళ్ళమని తెలిపారు.ఇక 2022లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము.

అలా 2024 డిసెంబర్లో మా పెళ్లి జరిగిపోయింది అంటూ ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన లవ్ స్టోరీ బయట పెట్టడమే కాకుండా ఆంటోనీ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం నా అదృష్టమని తెలిపారు.నా కెరియర్ పరంగా తను చాలా సపోర్ట్ చేశారు అంటూ కీర్తి సురేష్ వెల్లడించారు.

నా అఛీవ్ మెంట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు