కీర్తి సురేష్( Keerthy Suresh ).గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
తెలుగునాట మహానటిగా మంచి స్థానాన్ని దక్కించుకున్న నటీమణి కీర్తి సురేష్.అయితే అమ్మడు అదృష్టమో.
దురదృష్టమో తెలియదు కానీ ఆమె ఇటీవల కాలంలో నటించిన సినిమాలు అన్ని డిజాస్టర్ గా మారిపోతున్నాయి.మరీ ముఖ్యంగా ఆ మధ్య చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమా మీద అసలు పెట్టుకున్న కీర్తికి కాస్త గట్టిదెబ్బే తగిలింది.
ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ గతంలో చేసిన తప్పులను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

అవును, కీర్తి సురేష్ గతంలో ఎన్టీఆర్( Jr ntr ) సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట.కారణం ఆ దేవుడికెరుక గాని అప్పట్లో కీర్తి సురేష్ కి ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయకూడదో పెద్దగా తెలిసేది కాదట.ఆ కారణంగానే తారక్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమాలో ఆమె నటించలేదని తెలుస్తోంది.
ఆ తర్వాత ఆ రోల్ నిత్యామీనన్( Nithya Menen ) కి వెళ్ళింది.కాగా అది ఎంత ఇంపార్టన్స్ వున్న రోలో అందరికీ తెలిసిందే.దీంతో ఎన్టీఆర్ – కీర్తి సురేష్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది.

ఇక అలాంటి సినిమాలు ఆమె ఓ నాలుగైదు వరకు వదిలేసుకుందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.ఒకవేళ ఆ సినిమాలన్నీ ఆమె చేసినట్టైతే ఇప్పుడు కీర్తి సురేష్ ఎంతటి హై స్థానంలో ఉండేదో ఊహించుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు కీర్తి అభిమానులు.కానీ ఆమె బ్యాడ్ లక్ అంటున్నారు ఫ్యాన్స్.
అలా ఆమె వదులుకున్న ఇతర సినిమాల విషయానికొస్తే, మహానటి తరువాత ఆమెకి ‘సీతా రామం’ సినిమాలోని సెకండ్ హీరోయిన్ పాత్ర చేసే అవకాశం వచ్చిందట.కానీ ఆమె రిజెక్ట్ చేసింది.
ఇక ఆ రోల్ లో నేషనల్ క్రష్ రష్మిక నటించి మెప్పించిన సంగతి విదితమే.కాగా ఈ రోల్ రష్మిక ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది.
అదేవిధంగా సమంత హీరోయిన్ గా నటించిన సినిమా మజిలీ సినిమా కూడా మొదట ఈమె దగ్గరకే వెళ్లిందట.కానీ డేట్స్ క్రాష్ కావడంతో కీర్తి ఆ సినిమాని సున్నితంగా తిరస్కరించిదని టాలీవుడ్ టాక్.
అలా ఆమె జారవిడుచుకున్న మూడు నాలుగు సినిమాల వలన ఆమె కాస్త వెనకబడిందని అనుకుంటున్నారు.