మనం రోడ్లపై చూస్తూ ఉంటాం.ఏదైనా బ్యూటీ పార్లర్, సెలూన్, షాపింగ్ మాల్స్ ఇలా వాటి బోర్డులపై హీరో హీరోయిన్ ఫొటోస్ తగిలిస్తూ ఉంటారు.
నిజానికి ఆ హీరో హీరోయిన్లు కొన్ని షాపింగ్ మాల్ లకు సంబంధం ఉండదు.కనీసం వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండరు.
కానీ కొంతమంది వాళ్ళ ఫోటోలు తగిలిస్తూ బిజినెస్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఓ బోన్ సెట్టింగ్ క్లినిక్ కు ఆ క్లినిక్ యజమానులు కీర్తి సురేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు.
నిజానికి కీర్తి సురేష్ కు కూడా తను ఆ క్లినిక్ కు బ్రాండ్ అంబాసిడర్( Brand Ambassador ) గా ఉన్న విషయం తెలియదు.అయితే తాజాగా ఆ క్లినిక్ సంబంధించిన బోర్డులో తన ఫోటో చూసి షాక్ అయింది కీర్తి సురేష్.
ఇంతకూ ఆ ఫోటోలో తను ఎలా ఉందో చూద్దాం.

కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మహానటి సావిత్రి( Mahanati Savitri ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఈ సినిమా తర్వాత అందరికీ అభిమాని హీరోయిన్ గా మారింది.
అంతేకాకుండా అవకాశాలు కూడా బాగానే అందుకుంది.మొత్తానికి స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్.
అప్పటివరకు పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ సర్కారీ వారి పాట సినిమాలో అందాలు ఆరబోసి అందరికి షాక్ ఇచ్చింది.
ఇక అప్పటినుంచి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను చూపిస్తూ బాగా రచ్చ చేస్తుంది.
సోషల్ మీడియా( Social Media )లో ఆ ఫోటోలను పంచుకుంటూ కుర్రాలని నిద్రపోనివ్వకుండా చేస్తుంది.అంతే కాదండోయ్.ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా సన్నగా కూడా మారింది.నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉండేది కీర్తి సురేష్.

ఇక ఇటీవలే దసరా( Dasara ) సినిమాలో వెన్నెల పాత్రలో బాగా అదరగొట్టేసింది.అచ్చం పల్లెటూరి అమ్మాయిల కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది కీర్తి సురేష్.అయితే అందులో తనను ఒక వ్యక్తి తన బోన్ సెట్టింగ్, జాయింట్ క్లినిక్( Joint Clinic ) కు కీర్తి సురేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తన బ్యానర్ పై తగిలించాడు.

అంతే కాదండోయ్.కీర్తి సురేష్ కి చెయ్యి క్రాక్ వచ్చినట్లు.తను కూడా కట్టు కట్టుకున్నట్లు పెద్ద ఫోటో కూడా తగిలించాడు.దీంతో ఆ ఫోటో చూసి కీర్తి సురేష్ ఇక నవ్వుకున్నట్లు కనిపించింది.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తుంది.ఇక కీర్తి సురేష్ దసరా సినిమా సక్సెస్ లో ఉండగా ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో కూడా బిజీగా ఉందని తెలుస్తుంది.
మొత్తానికి ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు బాగానే నడుస్తుందని చెప్పాలి.