మహానటి ఫేమ్ కీర్తి సురేష్ క్రేజ్ మూడు నాళ్ల ముచ్చట అన్నట్లుగా మారింది.ఆమె స్థాయి అమాంతం పెరిగి అలా పడిపోయింది.
సర్కారు వారి పాట సినిమా లో కీర్తి సురేష్ నటించి మెప్పించింది.కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ లో బిజీ అవ్వలేదు.
ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆమెను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకుంటున్నా కూడా జనాలు మాత్రం ఆమెను గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు.
హీరోయిన్ గా కీర్తి సురేష్ ప్రస్తుతం దసరా సినిమా లో మాత్రమే నటిస్తోంది.తెలుగు లో దసరా సినిమా పై ఈమె చాలా ఆశలు పెట్టుకుంది.
దసరా సినిమా లో డీ గ్లామర్ రోల్ ను చేస్తున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా దసరా తో మళ్లీ బిజీ అవ్వాలని ఆశ పడుతుంది.కానీ దసరా సినిమా లో ఆమె డీ గ్లామర్ రోల్ చేయడం ద్వారా జనాలు ఎవరు ఆమెను పట్టించుకుంటారు అనేది తెలియడం లేదు.

హీరోయిన్ గా కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేయాల్సిన కీర్తి సురేష్ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉండటం ఆవేదన కలిగిస్తోంది.సర్కారు వారి పాట సినిమా లో స్కిన్ షో చేసింది.ఈ మధ్య కాలంలో ఆమె ఫొటో షూట్స్ ను చూస్తూ ఉంటే కచ్చితంగా ముందు ముందు అందాల ఆరబోత ఖాయం అన్నట్లుగా ఉంది.అయినా కూడా ఆమె యొక్క డేట్ల కోసం నిర్మాతలు అడగడం లేదట.
అంతే కాకుండా ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ను కనీసం తమిళ ఫిల్మ్ మేకర్స్ కూడా పట్టించుకోవడం లేదు.

మహా నటి సినిమా తో వచ్చిన క్రేజ్ ఏమాత్రం ఆమె యొక్క కెరీర్ లో ఇప్పుడు ఉపయోగ పడటం లేదు.కీర్తి సురేష్ కు ఉన్న క్లీన్ ఇమేజ్.స్కిన్ షో చేయదు అనే ఇమేజ్ వల్లే ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు.
చిరంజీవి తో భోళా శంకర్ సినిమా లో ఆయనకు చెల్లి పాత్రలో కీర్తి నటించింది.ఆ సినిమా కోసం పెద్దగా ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేయడం లేదు.







