మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్( Keerthy Suresh ) ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అంతా భావించారు.కానీ అందరూ ఊహించినట్టుగా కాకుండా ఆమె వరస పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.
ఏకంగా ఎనిమిది నుంచి తొమ్మిది సినిమాల వరకు ఆమెకు పరజయాలు తప్పలేదు.ఏ భాషలో తీసినా కూడా ఒక్క విజయం కూడా పలకరించలేదు.
అలాంటి సమయంలో కూడా మళ్లీ కీర్తి సురేష్ ని తెలుగు ఇండస్ట్రీ ఆదుకుంది.మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారు డైరెక్టర్ పరశురాం.
అప్పటికే కాస్త బొద్దుగా ఉండే కీర్తి సురేష్ సినిమా సినిమాకి బరువు తగ్గుతూ వచ్చింది.మహేష్ బాబు సరసన ఆమె ఎంతో చక్కగా కుదిరింది.ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆమె మళ్ళీ విజయాల బాట పట్టింది.మహానటి ( Mahanati ) విజయం తర్వాత దాదాపు 13 సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ కి ఒకటో రెండో మినహా అన్ని కూడా పరాజేయాలే.
సర్కారు వారి పాట సినిమా తర్వాత కూడా ఒకటి రెండు పరాజయాలు పలకరించిన ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఈ ఏడాదికి దసరా, బోలా శంకర్ వంటి రెండు భారీ చిత్రాలలో కీర్తి సురేష్ నటిస్తోంది.ఇక ఈ రెండు సినిమాలే కాకుండా మరొక నాలుగు తమిళ సినిమాలను కూడా లైన్లో పెట్టింది కీర్తి.ఈ నాలుగు సినిమాలు 2023 చివరికి లేదా ఈ 2024 తొలి నెలలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాల్లో ఏ రెండు సినిమాలు విజయం సాధించిన ఆమె కెరియర్ కు మరో నాలుగైదు ఏళ్ల పాటు డోకా లేకుండా కొనసాగుతుంది.ఇక ఇప్పుడు దసరా సినిమా( Dasara ) గురించి ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది.

గోదావరిఖని బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని మరియు కీర్తి సురేష్ ఊర మాస్ పాత్రలలో కనిపిస్తున్నారు.పైగా కీర్తి సురేష్ కి ఈ మధ్యకాలంలో నాని కాంబినేషన్ బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.దాంతో దసరా పై వీర లెవల్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి అభిమానులకు.దసరా సినిమా విజయవంతం అయితే కీర్తి సురేష్ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం లేకపోలేదు.
ఇలాంటి మాస్ పాత్రలకు కూడా సూట్ అవుతుందని జనాలు ఆమెను ఎంతగానో ఆరాధిస్తున్నారు.







