సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట అనే సినిమాని తెరపైకి తీసుకెళ్ళేందుకు రెడీ అయ్యారు.ఇక ఈ సినిమా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది ప్రస్తుతం దర్శకుడు సినిమాలో మెయిన్ క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
ఇందులో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట కొనసాగుతుంది.బాలీవుడ్ ముద్దుగుమ్మలైన కైరా అద్వానీ పేరు ముందుగా వినిపించింది.
తరువాత సాయి మంజ్రేకర్ పేరు ఎక్కువగా వినిపించింది.ఈ అమ్మడుని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసేసారు తనే టాక్ బలంగా వినిపించింది.
అయితే బాలీవుడ్ భామల కంటే కథలో క్యారెక్టర్ డిమాండ్ మేరకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్ అయితే బెటర్ దర్శకుడు భావించినట్లు టాక్.
ఈ నేపధ్యంలో ముందుగా అనుకున్న కీర్తి సురేష్ ని సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తుంది.
ఇక ఆమె కూడా నటించడానికి ఒకే చెప్పిందని సమాచారం.ఇక ఫైనల్ అగ్రిమెంట్ చేసుకొని హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తే మాత్రం సినిమాకి అదనపు ఎస్సెట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.