సర్కారీ వారి పాట డబ్బింగ్ పనులను పూర్తి చేసిన కీర్తి సురేష్.. పోస్ట్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహానటి కీర్తిసురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకుని 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

 Keerthi Suresh Completes Her Sarkaru Vari Paata Dubbing Post Viral, Keerthi Sure-TeluguStop.com

ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు.ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తన పని మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు కంటే ముందుగానే కీర్తి సురేష్ ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే తాను డబ్బింగ్ చెబుతున్నటువంటి ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ డబ్బింగ్ పూర్తి అయిన విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలకు సిద్ధమైంది.

Telugu Reels Banners, Keerthi Suresh, Tollywood-Movie

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా,మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube