కే‌సి‌ఆర్ ఓటమే లక్ష్యం.. ఒక్కటౌతున్న నేతలు ?

గత కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో( Telangana politics ) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి( Ponguleti, Jupally ) వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి హాట్ టాపిక్ గా మరయో అందరికీ తెలిసిందే.

 Kcr's Defeat Is The Goal , Kcr, Telangana Politics, Ponguleti, Jupally, Bjp, Ete-TeluguStop.com

ఈ ఇద్దరు బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలో చేరతారు ? వీరి ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనే చర్చ జోరుగా సాగుతోంది.వీరిద్దరిని పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ ఇటు బిజెపి విశ్వ ప్రయత్నలే చేస్తున్నాయి.

అయితే ఏ పార్టీలో చేరబోతున్న దానిపై మాత్రం ఈ ఇద్దరు ఇంతవరుకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.దీంతో అసలు ఈ ఏదైనా పార్టీలో చేరతారా ? లేదా ప్రత్యేక పార్టీ పెట్టబోతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

Telugu Etela, Mpponguleti, Jupally, Kcrs, Ponguleti, Telangana-Politics

అయితే ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు పొంగులేటి ప్రత్యేక పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.కే‌సి‌ఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పొంగులేటి పార్టీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం పొంగులేటి కే‌సి‌ఆర్ వ్యతిరేక శక్తులను కూడాగట్టే పనిలో ఉన్నారట.ప్రస్తుతం జూపల్లి పొంగులేటి తోనే కలిసి నడుస్తున్నారు.వీరికి తోడు మరికొంత మంది బలమైన నేతలు తోడైతే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనలు సృష్టించవచ్చనే ప్లాన్ లో ఉన్నారట పొంగులేటి.ఆ మద్య బిజెపి( BJP ) చేరికల కమిటీ చైర్మెన్ పొంగులేటి తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నించారు ఈటెల.అయితే పొంగులేటి తనకే కౌన్సిలింగ్ ఇచ్చారంటూ ఈటెల చెప్పుకొచ్చారు.

Telugu Etela, Mpponguleti, Jupally, Kcrs, Ponguleti, Telangana-Politics

ప్రత్యేక పార్టీ విషయమై తనతో కలిసి నడవాలని పొంతులేటి ఈటెల చెప్పినట్లుగా తెలుస్తోంది.కే‌సి‌ఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఉన్న ఈటెల( etela ) పొంగులేటి చెప్పిన మాటలకు సై అన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే ప్రస్తుతం బీజేపీలో ఈటెల కు సరైన ప్రదాన్యం లేదు.ఇక బీజేపీలో సరైన ప్రదాన్యం లేని మరో సీనియర్ నేత విజయశాంతి( Senior leader Vijayashanti )తో కూడా పొంగులేటి చర్చలు జరుపుతున్నారట.

దాంతో ఈటెల, విజయశాంతి వంటి బలమైన నేతలను కలుపుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ పై వార్ కు దిగేందుకు సిద్దమతున్నారట.అయితే బీజేపీ వీడే ప్రసక్తే లేదని ఈటెల, విజయశాంతి ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు.

మరి ఇప్పుడు పొంగులేటితో కలిసి వీరిద్దరు నడుస్తారా ? ఒకవేళ కలిసినడిచే ప్రయత్నం చేస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా టర్న్ కాబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube