కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గ్రూప్ తగాదాలు వీడి అందరూ కలిసికట్టుగా పని చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.
కాగా వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలో దిగనున్నారన్న సంగతి తెలిసిందే.







