'ఈటెల ' అవసరం తెలిసొచ్చిందా ? లేదా రాజకీయమా ? 

టిఆర్ఎస్ (బీఆర్ఎస్ ) ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను అకస్మాత్తుగా ఆ పదవి నుంచి భర్తరఫ్ చేసి పార్టీ నుంచి సాగనంపారు ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్.

ఆ తర్వాత క్రమంలో ఆయన బిజెపిలో హుజురాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

ఆయనను ఓడించేందుకు కేసిఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక నాయకులందరినీ ఆ నియోజకవర్గంలో మోహరించారు.

అయినా ఎన్నికలు ఫలితాల్లో రాజేందర్ సత్తా చాటుకుని మళ్లీ బిజెపి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన ఈటెల రాజేందర్ కు ఆ పార్టీలో గట్టుపట్టే ఉండేది.

కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో బలమైన నేతగా రాజేందర్ గుర్తింపు పొందారు.కానీ రాజేందర్ ఆ తరువాత కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు.

Advertisement
Kcr Tactics Behind Mentioning Etela Rajender Name In Assembly Details, Brs,kcr,t

కెసిఆర్ కు బద్ధ శత్రువుగా రాజేందర్ మారిపోయారు.అయితే ఇప్పుడు కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

ఈటెల రాజేందర్ విషయంలో ఆయన మనసు మార్చుకున్నారో .లేక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజేందర్ మళ్లీ బి ఆర్ ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Kcr Tactics Behind Mentioning Etela Rajender Name In Assembly Details, Brs,kcr,t

బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్  ప్రభావాన్ని తగ్గించేందుకు కొద్దిరోజుల క్రితం మండలి వైస్ చైర్మన్ గా బండ ప్రకాష్ కు అవకాశం కల్పించారు.అయినా బీసీల్లో రాజేందర్ పై సానుకూల దృక్పథం ఉండడాన్ని కెసిఆర్ గుర్తించినట్టుగా కనిపిస్తున్నారు.ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

ఆయన మొహం చూసేందుకు కూడా కెసిఆర్ ఇష్టపడలేదు.కానీ బడ్జెట్ సమావేశాల్లో రాజేందర్ కు మాట్లాడే అవకాశం కల్పించారు.ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కేసీఆర్ వ్యవహరించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

రాజేందర్ అడిగిన అన్ని ప్రశ్నలకు కెసిఆర్ స్వయంగా సమాధానాలు చెప్పారు.

Advertisement

రాజేందర్ ను పిలిచి చర్చించి ఆయన ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులకు కెసిఆర్ సభలోనే చెప్పారు.ఇక ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజేందర్ ను గౌరవిస్తూ పలకరింపులు వంటివి చేపట్టారు.

దీంతో ఒకసారిగా రాజేందర్ వైఖరిలో టిఆర్ఎస్ నేతల వైఖరి మారడం చర్చినీయాంసంగా మారింది.రాజేందర్ ను పార్టీలో చేర్చుకునేందుకు కేసిఆర్ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.

అదికాకపోతే బిజెపిలో అలజడి సృష్టించేందుకు రాజేందర్ తమతో ఎప్పటికైనా కలుస్తాడు అనే సంకేతాలు బిజెపికి ఇస్తే.రాజేందర్ కు బిజెపిలో ప్రాధాన్యం తగ్గుతుందనే ఆలోచనతో కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారా అనే అనుమానాలు, ఆసక్తి అందరిలోనూ కలుగుతున్నాయి.

తాజా వార్తలు