తెలంగాణ లో రెండు పర్యాయాలు అధికారం చేపట్టడంతోనే తెలంగాణ తెచ్చిన పార్టీ గా కెసిఆర్( CM KCR ) గుడ్ విల్ ఖతమైపోయింది అని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ).ఎన్నికల సందర్భంగా ఈనాడు కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్ రెడ్డి అనేక ఆలోచనలు పంచుకున్నట్టుగా తెలుస్తుంది .

జాతీయ కాంగ్రెస్ లో ఇప్పుడు ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి తెరపడిందని ప్రభుత్వాలనైనా వదులుకుంటుంది తప్ప అసమ్మతి వాదుల గొంతులకు తలవంచడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ని మార్చమని జ్యోతిరాదిత్య సిందియా పట్టు పట్టినప్పటికీ పార్టీ ఆయనను వదులుకుందే తప్ప ముఖ్యమంత్రిని మార్చలేదని అలానే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం విషయంలో కూడా కాంగ్రెస్ అదే విధంగా గట్టిగా నిలబడిందని ఆయన చెప్పుకొచ్చారు.ఈసారి తెలంగాణ లో ఎన్నికలలో 50 శాతం సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏ వర్గానికి అన్యాయం జరగలేదు అన్న సంకేతాలు ఇవ్వడానికే అభ్యర్థులు కూర్పుపై ఎక్కువ సమయం తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవిపై ఆశవహులు పెరిగిపోయారు కదా అన్న ప్రశ్నకు ఆయన వివిధ వర్గాలు కాంగ్రెస్లో అధికారం కోరుకోవడం సహజమేనని అది మా పార్టీకి ఉన్న ప్రత్యేక గుర్తింపని మిగతా పార్టీలలో ఆ పరిస్థితి లేదు కదా అంటూ ఆయన సమాధానం ఇచ్చారు అంతేకాకుండా సంక్షేమ పథకాలు ద్వారా బారాస మరోసారి అధికారం లోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది కదా అన్న ప్రశ్నకు 1985 -89 ప్రాంతంలో కూడా ఎన్టీఆర్( NTR ) అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారని కానీ 1989లో ఓడిపోయారని అలాగే 2014 లో కూడా చంద్రబాబు( Chandrababu naidu ) అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకున్నారని అయినా ప్రజలుప్రభుత్వాన్ని మార్చారని అధికారం లో ఉన్నంతసేపు బలంగా ఉన్నామని అనిపించడం సహజమేనని ఆయన చెప్పుకొచ్చారు .కాంగ్రెస్ మేనిఫెస్టో లేట్ అయింది అన్న ప్రశ్నకు ఇప్పటికే ఆరు గ్యారెంటీ లను చాలా కాలం క్రితమే ప్రకటించామని అవే తమ ప్రధాన అభ్యర్థులని ఆయన చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ప్రకటించిన ప్రాజెక్టులకే పేర్లు మార్చి బారా స అభివృద్ధి చేసిందని బారాస ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయాయని వాటిని తిరిగి తెలంగాణ ప్రజలకు అందిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.