ఫెడరల్ ఫ్రంట్ పై మళ్ళీ కసరత్తు మొదలెట్టిన కేసీఆర్! కేంద్రంలో చక్రం తిప్పుతాడా

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజులుగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.

కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయంగా అన్ని ప్రాంతీయ పార్టీలని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కేంద్ర ఓ వైపు కేసీఆర్ చక్రం తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే మరో వైపు చంద్రబాబు, కాంగ్రెస్ కి మద్దతుగా ప్రాంతీయ పార్టీలకి ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఇప్పటికే మమతతో థర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడటం జరిగిందని, ఆమె కూడా కేసీఆర్ తో చర్చించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.మరో వైపు అఖిలేష్ యాదవ్ కూడా కేసేఆర్ థర్డ్ ఫ్రంట్ కి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక చాలా పార్టీలు కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల ముందే పార్టీలకి ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారని పినరయి విజయన్ తో కలయిక ద్వారా తెలుస్తుంది.ఇప్పటికే బీజేపీకి ఈ సారి ఎక్కువ సీట్లు రావని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాఖ్యల నేపధ్యంలో కేసేఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలు ఆసక్తికరంగా మారాయి, .

Advertisement
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

తాజా వార్తలు