తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో సార్వత్రిక ఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది.మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని ఆ పార్టీ అధినేత కెసిఆర్ లో కనిపిస్తోంది.
ఇప్పటి నుంచే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరిని అభ్యర్థులుగా దించాలనే విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు.
అంతకంటే ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉంది ? క్షేత్రస్థాయిలో వారి పనితీరు ఎలా ఉంది ఇలా అనేక విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారట.ఈమేరకు ఎమ్మెల్యేల పనితీరుపై తాజా సర్వే నిర్వహించినట్లు సమాచారం.
ఆ నివేదికలు అందడంతో ఆ సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలను నేరుగా పిలిపించి గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం.
ఈ సర్వేలో అత్యల్ప మార్కులు పడిన వారికి ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని , ఆ స్థానంలో వేరొకరని అభ్యర్థిగా నిలబడతాము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారట.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఏ ఏ అంశాల్లో అసంతృప్తి ఉంది అనే అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకున్నారట.ఏ ఏ విషయాల్లో ప్రజల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ?నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? అభ్యర్థిని మారిస్తే అక్కడ టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా లేదా ఇలా అనేక అంశాలపై సర్వే రిపోర్టులను కేసీఆర్ తెప్పించుకున్నారట.పనితీరు సక్రమంగా లేని ఈ ఎమ్మెల్యేలను పిలిచి వారి ముందు ఈ సర్వే రిపోర్ట్ లను పెట్టడం, పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో కేసీఆర్ తో క్లాస్ పీకించుకున్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గాల్లోనే మకాం వేశారట.
ఏ అంశాల్లో తమ పనితీరుపై జనాల్లో అసంతృప్తి ఉందనేడు గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారట.చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గం దాటి బయటకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని, నిరంతరం ప్రజలలో తిరుగుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తూ , అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.ఎమ్మెల్యేల పనితీరులో అనూహ్యంగా మార్పు రావడం పార్టీ కేడర్ లో కూడా ఆశ్చర్యం కలిగేలా చేస్తోందట.