అంచనాలు పెంచేసిన కేసీఆర్ ! టీఆర్ఎస్ లో సందడి

ఒక్కసారిగా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.హుజురాబాద్ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు టెన్షన్ గానే ఉన్నట్టుగా ఆ పార్టీ నాయకులు కనిపించారు.

ప్రభుత్వ వ్యతిరేఖత తో ఎక్కడ టిఆర్ఎస్ తమ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుంది అనే ఆందోళన కనిపించింది.అయితే దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గం లో అమలు కాకుండా బిజెపి లేఖ రాసింది అనే ప్రచారం ఉదృతం కావడంతో బీజేపీకి ఇక్కడ ఇబ్బందికరంగా మారింది.

అసలు ఆ ప్రస్తావన తాము తీసుకు రాలేదని , కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదని ,బీజేపీ ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖను విడుదల చేసినా,  జరగాల్సిన నష్టం జరిగింది.ఇదిలా ఉంటే హుజురాబాద్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  నాయకులంతా ఈ నియోజకవర్గంలో ఉదృతంగా  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి ఓటర్ ను పలకరిస్తూ గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Advertisement

టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని, గ్రామాల వారిగా దత్తత తీసుకుని ప్రత్యేకంగా దృష్టి పెడతాను అంటూ ఇప్పటికే టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు వంటి వారు ప్రకటించారు.ఇక ఈ నియోజకవర్గంలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగబోతుండడం తో అంతకుముందే సీఎం కేసీఆర్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టిఆర్ఎస్ కు తిరుగులేకుండా చేసుకోవాలనే లెక్కలు ఆ పార్టీ నేతలు ఉన్నారు.

అయితే కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారా రారా అనే సందేహం ఇప్పటివరకు ఉంది.

కానీ తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఓడించాలి అంటే ఖచ్చితంగా తాను రంగంలోకి దిగాలని కేసీఆర్ డిసైడ్ అవ్వడం తో, ఈ నెల 26 ,27 తేదీల్లో ఏదో ఒక రోజున కేసిఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు అడ్డుగా మారటంతో,  ఈ నియోజకవర్గానికి అనుకుని ఉన్న మరో చోట దీనిని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.దీని ద్వారా ఆ బహిరంగ సభ ఎఫెక్ట్ హుజూరాబాద్ నియోజకవర్గం లో కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు.

ఈ పరిణామాలు అన్నీ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించేలా చేస్తున్నాయి.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు