దేశంలో మార్పు కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
60 ఏళ్ల అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం ఆరు ఏళ్లలో చేసి చూపారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.గజ్వేల్ కు రింగురోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్ తో పాటు డ్యాములు తెచ్చామని చెప్పారు.
గతుకుల గజ్వేల్ ను బతుకుల నిలయంగా మార్చామన్నారు.తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని విమర్శించారు.
దేశంలో మార్పు కోసం కేసీఆర్ బయలుదేరారని తెలిపారు.తాము రాష్ట్ర ప్రజలకు గులాంగిరి చేస్తాం తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని వెల్లడించారు.
ఈ సందర్బంగా అందరూ కలిసి బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించుకోవాలని సూచించారు.