యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ లో కెసిఆర్ కుటుంబం వందల కోట్లు కొల్లగొట్టిందని మండిపడ్డారు.. రేవంత్ రెడ్డి.

యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయ కన్స్ట్రక్షన్ లో కెసిఆర్ కుటుంబం వందల కోట్లు కొల్లగొట్టిందని మండిపడ్డారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.ఒక వర్షానికే యాదగిరిగుట్ట గుంతల మయం అయిందని వాపోయారు.

 Kcr Family Looted Hundreds Of Crores In Yadagirigutta Construction Rewanth Redd-TeluguStop.com

రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ అని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.ప్రజా గాయకుల గద్దర్ చేత రూపొందించన గాంధీ కుటుంబ త్యాగాల దృశ్య కావ్యం రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ సందర్భంగా ఎల్.వి ప్రసాదర్ స్టూడియోలో దృశ్య కావ్యాన్ని వీక్షించారు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షలు రేవంత్ రెడ్డి.వర్కింగ్ ప్రసిడెంట్ గీతా రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,జగ్గా రెడ్డి, తదితర కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికార అవకాశం వచ్చినా సోనియా గాంధీ కుటుంబం అధికారం చేపట్టడం లేదని వాపోయారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.రేపు జరగబోయే వరంగల్ సభకు రాహుల్ గాంధీ గళం వినడానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రాబోయే సర్కారు కాంగ్రెస్ పార్టీదని ధీమా వ్యక్తం చేశారు ఆయన.గద్దర్ గళం మాకు వెయ్యి ఏనుగుల బలం అని హితవు పలికారు.గాంధీ కుటుంబం దేశానికి అనేక సేవలు అందించిందని, శ్రీమతి ఇందిరా గాంధీ ప్రజల కోసం చివరి రక్తం బొట్టు అర్పించిందన్నారు.

రాహుల్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను యువతకు తెలియ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి.

దేశానికి స్వాతంత్రం ఏర్పాటు పోరాటంలో నెహ్రూ తన జీవితాన్ని జైలులో గడిపాడు అని చెప్పుకొచ్చారు.మాజీ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు ఆయన.రేపు ఓరుగల్లు లో జరిగే రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడతారు తెలిపారు.జనం వాయిస్ దృశ్యకావ్యం ను ప్రజా నౌక గద్దర్ గళం తో చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube