గెలవడం కాదు ఎన్ని గెలిచామన్నది ముఖ్యం

ఉద్యమ పార్టీగా మొదలై అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తెలంగాణ సాధించిన కీర్తిని దక్కించుకొని ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిష్టించిన గులాబీ పార్టీ మరో వసంతంలోకి అడుగు పెట్టింది .

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత వచ్చిన మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని గులాబీ పార్టీ ఘనంగా నిర్వహించుకుంది .

తెలంగాణ భవన్లో జరిగిన ఈ వేడుకలలో పాల్గొన్న పార్టీ అధినేత కేసిఆర్( KCR ) తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి బారాస జెండా ఎగరవేశారు .ఎన్నికల సంవత్సరం అయినందున పాటించాల్సిన విధివిధానాలను సభ్యులకు వివరించిన కేసీఆర్ ,, ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన విధానాలపై దిశా నిర్దేశం చేశారు.దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం కోసం జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని తెలిపిన కేసీఆర్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్( Abki Bar Kisan Sarkar ) నినాదంతో జాతీయ స్థాయిలో ముందుకు వెళ్తున్నామని ,తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావడం టార్గెట్ కాదని, గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునేలా ప్రణాళికల రూపొందించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు .

Kcr Directed The Party Members Towards , Kcr , Brs Party , Bjp , Abki Bar Kisa

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని, ప్రజలతో కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవాలని, ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన నేతలకు సూచనలు చేశారు .సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని ఇంతకుముందు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు పనిచేసే వారికే సీట్లంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజల పట్ల బాధ్యతగా ఉండి వారి బాగోగులను పట్టించుకునే వారికే అధికారం వస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Kcr Directed The Party Members Towards , Kcr , Brs Party , Bjp , Abki Bar Kisa

ఆవిర్భావ సభ సందర్భంగా కొన్ని తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టారు వాటిలో ముఖ్యాంశాలను గమనిస్తే దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించాలి.రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్ట్ నిర్మించాలి దళిత బందును( Dalit Bandu ) దేశమంతటా అమలు చేయాలి దేశమంతా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలి దేశమంతటా రహదారుల నిర్మాణం జరగాలి ,మౌలిక సదుపాయాలు నా అభివృద్ధి చేయాలి.దేశంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి దేశంలో బీసీ జనన జరగాలి.

Advertisement
KCR Directed The Party Members Towards , KCR , BRS Party , BJP , Abki Bar Kisa
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు