కేసీఆర్ సస్పెన్స్ లో పెట్టేస్తున్నాడే..? 10 న ముహూర్తం ఫిక్సేనా ...?

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎటువంటి డెవలప్మెంట్ కనిపించడం లేదు.

అసలే ముహూర్తాలు సెంటిమెంట్లను బలంగా నమ్మే కేసీఆర్ విస్తరణను ఆలస్యం చేసే కొద్దీ.ఆశావహుల్లో అసహనం పెరిగిపోతోంది.

అసలు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి.? ఎవరికి ఏ శాఖ వస్తుంది.? అనే లెక్కలు తెరపైకి వస్తున్న తరుణంలో కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు.ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని.

అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి.కానీ ఆ తేదీలు మారిపోయాయి.

Advertisement

కానీ.ఈనెల 10న ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే పదో తేదీన బలమైన ముహూర్తం ఉండడంతో కేసీఆర్ తన క్యాబినెట్ ను విస్తరించాలని చూస్తున్నట్టుగా టిఆర్ఎస్ పార్టీలో జోరుగా ప్రచారం స్టార్ట్ అయింది.

కేసీఆర్ కు సెంటిమెంట్ ప్రకారం తొలివిడత మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఆ తర్వాత రెండో విడతలో సామాజిక సమీకరణలు లెక్కలు చూసి నెమ్మదిగా మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ చూస్తున్నాడట.అదీకాకుండా.

మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండడంతో కేబినెట్ విస్తరణ ఈ లోపుగానే ముగించేయాలని చూస్తున్నాడు కేసీఆర్.టీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 మంది వరకు మంత్రులు గా తీసుకునే అవకాశం ఉంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

అయితే ప్రస్తుతం కేసీఆర్ తో పాటు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మాత్రమే ఉన్నారు.అంటే ఇంకా 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపంలోనే ఉండడంతో.ఎన్నికల తంతు పూర్తి అయిన తరువాత మంత్రివర్గ విస్తరణ చేస్తే అసంతృప్తుల వల్ల పెద్దగా నష్ట పోయేది ఏమీ ఉండదని కేసీఆర్ భావిస్తున్నాడు.అయితే తొలి విడతలో హరీష్ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకి ప్రాధాన్యం దక్కుతుందా లేదా అని చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణ కు సంబంధించి ఎన్ని కథనాలు వచ్చినా ఎన్ని చర్చలు జరిగినా కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే తన పని తాను చేసుకు పోతున్నాడు.దీంతో అసలు కేసీఆర్ మనసులో ఏముంది.? అనేది తెలియక నాయకులు సతమతం అయిపోతున్నారు .

తాజా వార్తలు