ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది.దాదాపు ఐదున్నర గంటలుగా కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఉదయం తన పది మొబైల్ ఫోన్లను కవిత ఈడీ అధికారులకు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కవిత ఫోన్లలోని డేటాను ఈడీ అధికారులు సేకరించే పనిలో పడ్డారు.
జీవోఎం ఆమోదించని లిక్కర్ పాలసీ డ్రాప్ట్ కాపీ, నిందితులతో జరిపిన చాట్స్ తో పాటు ఫోన్లలో డిలీట్ అయిన డేటాకి సంబంధించిన కీలక ఆధారాలను ఈడీ సేకరించనుంది.కాగా మద్యం కుంభకోణంలో మొత్తం 36 మంది నిందితులు సుమారు 170 ఫోన్లను మార్చారని ఈడీ ఆరోపిస్తుంది.2021లో 3 ఫోన్లు, 2022లో 7 ఫోన్లను కవిత మార్చారని ఈడీ చెబుతోంది.సుమారు 1.30 కోట్ల విలువైన ఫోన్లు ధ్వంసం అయ్యాయని వాదిస్తున్న ఈడీ 17 ఫోన్లలో ఉన్న డేటాని సేకరించింది.మరోవైపు ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కవిత ప్రకటించారు.