భారత రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, తెలంగాణ శాసన మండలి సభ్యురాలు (MLC) కె.కవిత గురువారం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని “రైతు వ్యతిరేకం” మరియు “పేదలకు వ్యతిరేకం” అని అభివర్ణించారు.
నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ప్రధాని మోదీ విఫలం కావడమే కాకుండా పైగా దేశాన్ని పట్టపగలు 19 లక్షల కోట్ల రూపాయలకు కార్పొరేట్ సంస్థలు దోచుకునేలా చేశారని ఆమె ఆరోపించారు.
నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కె.
చంద్రశేఖర్‌రావు కుమార్తె కల్వకుంట్ల కవిత విలేకరులతో మాట్లాడారు.‘’ఈరోజు బీజేపీ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక ప్రభుత్వం, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం అన్నది వాస్తవం.ఒకవైపు ప్రభుత్వం రైతులు, పేదలను లక్ష్యంగా చేసుకుంటూ, పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై పన్నులు వేస్తూ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోతోంది, మరోవైపు, ప్రభుత్వం కార్పొరేట్ల రూ.19.40 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది ”అని ఆమె విమర్శించింది.
“కార్పోరేట్లు దోచుకుని దేశం విడిచి పారిపోతున్నప్పుడు చౌకీదార్లు నిద్రపోతున్నారు” అని కవిత చురకలు అంటించింది.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కింద వ్యవసాయ డ్రైయింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి ఖర్చు చేసిన రూ.152 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడంపై కవిత మండిపడ్డారు.కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆమె ప్రకటించారు.

వ్యవసాయాన్ని ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌తో అనుసంధానం చేయాలనే డిమాండ్‌ను ఆమె పునరుద్ఘాటించారు.దీని వల్ల వ్యవసాయ ఖర్చు తగ్గుతుందని, అలాగే రైతుల లాభం పెరుగుతుందని అన్నారు.తమ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, ఇప్పుడు బీఆర్‌ఎస్ ఈ విజన్‌ని ముందుకు తీసుకెళ్తుందని కవిత అన్నారు.బీఆర్‌ఎస్ మొత్తం దేశంలోని రైతులు, పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రజానుకూల విధానాలు, ముఖ్యంగా రైతుల కోసం బీజేపీ కూడా ఆలోచించాలని కవిత సూచించింది.







