‘కవచ్ టెక్నాలజీ’.ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టం.
ఏదైనా కారణం చేత రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చినప్పుడు అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ 2022 సంవత్సరంలో ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.
సుమారు రూ.400 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం కవచ్ వ్యవస్థను తీసుకువచ్చింది.రెండు రైళ్లు ఒకే ట్రాక్ లోకి వస్తే ఆటోమేటిక్ గా ఆగిపోయే విధంగా పని చేస్తుంది.
రైలు వేగాన్ని నియంత్రించడమే కాకుండా ట్రైన్స్ సురక్షితంగా నడిచే విధంగా సాయపడుతుంది.నిర్ణీత సమయంలో కనుక బ్రేకులు వేయడం విఫలం అయితే ఆటోమేటిక్ గా బ్రేక్ లు వేసి రైళ్లను ఆపివేస్తుంది.
ఈ క్రమంలో కవచ్ టెక్నాలజీని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం దేశంలో దశల వారీగా ఈ టెక్నాలజీ అమలులోకి వస్తుంది.
అయితే ఈ వ్యవస్థ ఒడిశా రూట్లలో ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.ఒకవేళ కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదంటున్నారు రైల్వే అధికారులు.