స‌వాళ్లు విసురుతున్న కౌషిక్ రెడ్డి.. 100 కోట్లు తేవాలంటూ ఈట‌ల‌పై ఫైర్..!

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వేడి రాజుకుంటోంది.గ‌త కొద్ది రోజు నుంచి స్థానిక నేత‌ల మధ్య ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక తాజాగా చేసుకున్న ఆరోప‌ణ‌లు తారాస్థాయికి చేరాయి.మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్ట్ తో ఈట‌ల ఇలాక‌లో ఇద్ద‌రు నేత‌లు తీవ్ర వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు.

రీసెంట్ గా స్థానిక ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.హుజూరాబాద్ టౌన్లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.

అంబేద్కర్ నగర్ లో చర్చకు రా.అంటూ సవాల్ విసిరారు.అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి కేంద్రం నుంచి ఒక్క రూపాయయైనా తీసుకొచ్చావా.? అని ప్రశ్నించారు.హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపొందిన ఈటల రాజేందర్ గత కొన్నిరోజులుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

Advertisement
Kaushik Reddy Throwing Challenges , Etala Rajender , MLC Koushik Reddy , Huzurab

అవసరమైతే గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ పై గెలుస్తాన‌ని అన్నారు.ఈ నేపథ్యంలో ఇదే నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

ఏకంగా హుజూరాబాద్ టౌన్లో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్యేగా గెలిచిన 10 నెలల్లో హుజూరాబాద్ కు ఏం చేశారో తెలియజేయాలన్నారు.

ఈటల రాజేందర్ సొంత ఊరు కమలాపూర్లోనే బస్టాండ్ లేదని అలాంటయన నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ది చేస్తాడని ఎద్దేవా చేశారు.సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయలేని ఈటలకు గజ్వేల్ లోపోటీ చేసే దమ్ముందా.? అని ఫైర్ అయ్యారు.

Kaushik Reddy Throwing Challenges , Etala Rajender , Mlc Koushik Reddy , Huzurab

100 కోట్లు తీసుకురా.

హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు రూ.100 కోట్లు తీసుకురా.నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.120 కోట్ల రూపాయలు తీసుకొస్తా.అంటూ ఈటలపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలా తెచ్చె సత్తా ఉందా.? అని సవాల్ విసిరారు.ఈటల రాజేంద్ హైదరాబాద్ లో యాక్టర్ గా.ఢిల్లీలో బ్రోకర్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంతో గౌరవప్రదంగా ఉన్న ఆయన బీజేపీలో చేరి అభాసుపాలవుతున్నారని అన్నారు.

Advertisement

అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ లో జోష్ పెరిగిందా.? ఇన్నాళ్లు టీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉన్న కౌశిక్ ఒక్కసారిగా ఫైర్ కావడంతో వెనుక కార‌ణం ఏంట‌ని ఆలోచిస్తున్నారు.

తాజా వార్తలు