స్కూల్ పిల్లలతో హీరోయిన్ కత్రినా కైఫ్ డ్యాన్స్.. వీడియో వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి మనందరికీ తెలిసిందే.అందం అభినయం కలగలిసిన హీరోయిన్లలో కత్రినా కైఫ్ కూడా ఒకరు.

 Katrina Kaif Dance With School Children Videos Going Viral On Internet ,katrina-TeluguStop.com

ఈమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కత్రినా కైఫ్.

తాజాగా సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ డ్యాన్స్ కి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో కత్రినా కైఫ్ స్కూల్ పిల్లలతో కలిసి డాన్సు చేసింది.

 Katrina Kaif Dance With School Children Videos Going Viral On Internet ,katrina-TeluguStop.com

బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకు పిల్లలతో కలిసి స్టెప్పులు వేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ ఫోటోని చూసిన కత్రినా కైఫ్ అభిమానులు ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడంతో పాటు ఆ వీడియో పై కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.ఇటీవలే తమిళనాడు మధురైలోని మౌంటెన్ వ్యూ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కత్రినా కైఫ్ పాల్గొని కాసేపు విద్యార్థులతో ముచ్చటించి,అనంతరం పిల్లలతో కలసి పాపులర్ సాంగ్ అరబిక్ కుతు కు డ్యాన్స్ చేసింది.

ఆ వీడియోని చూసిన అభిమానులు స్టార్ హీరోయిన్ అయినా కత్రినా కైఫ్ పిల్లలతో కలసి పోయి అంత బాగా డాన్స్ చేయడం పట్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా కత్రినా కైఫ్ నటిస్తున్న టైగర్ 3 సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయిన విషయం తెలిసిందే.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా ఈద్ పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.ప్రస్తుతం కత్రినా కైఫ్ మెర్రి క్రిస్‌మస్ ఫోన్ బూత్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube