Bedurulanka 2012 Review: బెదురులంక 2012 రివ్యూ: కార్తికేయ ఖాతలో హిట్ పడినట్లేనా?

డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన సినిమా బెదురులంక 2012.( Bedurulanka 2012 ) ఇక ఈ సినిమాలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా మూఢనమ్మకాల నేపథ్యంలో రూపొందింది.

 Bedurulanka 2012 Review: బెదురులంక 2012 రివ్యూ: �-TeluguStop.com

ఇక ఇందులో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, గోపరాజు రమణ, సత్య, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించారు.ఈ సినిమాకు లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.

మణిశర్మ సంగీతం అందించాడు.సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీగా పనిచేశాడు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ, నేహా ఈ సినిమా కలిసొచ్చిందా లేదా చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.బెదురులంక( Bedurulanka ) అనే ఒక గ్రామంలో నివసిస్తున్న భూషణం (అజయ్ ఘోష్)( Ajay Ghosh ) అనే ఒక వ్యక్తి ఒక ప్లాన్ వేస్తాడు.అయితే ఆ ఊరి బ్రాహ్మణుడైన బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (రాంప్రసాద్) లతో కలిసి భూషణం ఆ ఊరి ప్రజలను భయపెట్టాలని చూస్తాడు.

అదేంటంటే యుగాంతం పేరుతో చెప్పి వారిని భయపెట్టిస్తాడు.దీంతో యుగాంతం ఆగాలంటే ఊర్లో ఉన్న బంగారం అంతా కరిగించి శివలింగం శిలువ తయారు చేయించి గంగా నదిలో వదిలేయాలని ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) తో( Goparaju Ramana ) ఆ ఊరి ప్రజలకు చెప్పిస్తాడు.

అయితే శివ (కార్తికేయ)( Karthikeya ) మాత్రం అతడి మాటలు వినడు.ఇక శివ అప్పటికే ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి) తో( Neha Shetty ) ప్రేమలో ఉంటాడు.అయితే ఆ ప్రెసిడెంట్ శివ తన మాటకు ఎదిరించాడు అని ఊర్లో నుంచి పంపిస్తాడు.మరి ఊర్లో నుంచి బయటికి వెళ్లిన శివ మళ్లీ తిరిగి ఎప్పుడు వస్తాడు.

తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుంటాడా లేదా.అంతేకాకుండా మూఢనమ్మకాల పేరుతో మోసం చేస్తున్న వారిని పట్టుకుంటాడా లేదా.మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికి వస్తే.కార్తికేయ ఎప్పటి లాగానే తన పాత్రకు న్యాయం చేశాడు.శివ పాత్రలో( Shiva Role ) చాలా ఎనర్జీ గా కనిపించాడు.యాక్షన్, కామెడీ సీన్స్ తెలుగులో కూడా బాగానే అదరగొట్టాడు.నేహా శెట్టి కూడా బాగానే పర్ఫామెన్స్ చేసింది.

ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా పనిచేశారు.కొంతమంది కమెడియన్స్ తమ కామెడీతో బాగా నవ్వించారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ ఈ సినిమాను ఒక మూఢ నమ్మకం అని కాన్సెప్ట్ తో తీసుకొచ్చాడని చెప్పాలి.మణిశర్మ( Manisharma ) అందించిన పాటలు పరవాలేదు.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ కూడా బాగా అనిపించాయి.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

డైరెక్టర్ ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.ప్రారంభంలో కథ మొదలు అవ్వడానికి కాస్త టైం పట్టినా కూడా ఆ తర్వాత బాగానే ఆడిందని చెప్పాలి.

మధ్యలో డైలాగులు, కామెడీ మాత్రం హైలెట్ గా చూపించాడు.ఇక హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని అంతగా చూపించలేదని చెప్పాలి.ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ గా చూపించాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:

కామెడీ, సెకండాఫ్, క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నెమ్మదిగా సాగినట్లు అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే మూఢనమ్మకాల పేరుతో వచ్చిన ఈ సినిమా కామెడీ పరంగా బాగా అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక కొంతవరకు కార్తికేయకు సక్సెస్ అందిందని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5

.

Bedurulanka 2012 Movie Genuine Public Talk

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube