నిఖిల్( Nikhil Siddhartha ) కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న కార్తికేయ , కార్తికేయ 2 సినిమాలు అతని రేంజ్ పెంచాయి.కార్తికేయ 2 ( Karthikeya 2 )తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయ్యాడు నిఖిల్.
తన నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.ఇదిలాఉంటే కార్తికేయ 2 చివర్లో కార్తికేయ 3 కి సంబంధించిన క్లూ కూడా ఇచ్చాడు.
చందు మొండేటి కార్తికేయ 3 కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది.అయితే ప్రస్తుతం నాగ చైతన్య( Naga Chaitanya (తో చందు మొండేటి సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.</br?
ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ తో కార్తికేయ 3 ఉండే ఛాన్స్ ఉంది.కార్తికేయ 3 అన్ని విధాలుగా కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు.ఆ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే అని తెలుస్తుంది.
నాగ చైతన్య సినిమా పూర్తి కాగానే చందు నెక్స్ట్ కార్తికేయ 3 సినిమానే చేస్తారని తెలుస్తుంది.అయితే ఈసారి కార్తికేయ 3 ఎలాంటి కథతో వస్తుంది.
కార్తికేయ 2 కి 3 కి సీక్వల్ లా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఎప్పుడొచ్చినా కార్తికేయ 3 తో మరోసారి పాన్ ఇండియా వైడ్ గా నిఖిల్ తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు.