కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి.మొదట ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ కళ్యాణం, చందమామ వంటి సినిమాల నుండి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా చేసి స్టార్డం సంపాదించింది.
ఈమె మగధీర ( Magadheera ), మిస్టర్ పర్ఫెక్ట్,డార్లింగ్ ,నాయక్, టెంపర్,నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150, బృందావనం, బాద్ షా వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అయితే కాజల్ అగర్వాల్ ఎంతోమంది హీరోల సరసన చేసి వారికి లక్కీ అయ్యింది కానీ ఆ ఒక్క హీరోకి మాత్రం డిజాస్టర్ సినిమాస్ అందించిందట.

అంతేకాదు ఆ హీరో ఇంకెప్పుడూ కాజల్ అగర్వాల్ తో చేయను అని కూడా నిర్ణయించుకున్నారట.ఇక ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ.అసలు విషయం ఏమిటంటే .కాజల్ రవితేజ ( Raviteja ) కాంబినేషన్లో ఇప్పటికే వీర, సారొచ్చారు ( Sarocharu ) వంటి సినిమాలు వచ్చాయి.అయితే ఈ రెండు సినిమాలపై కాజల్ రవితేజ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.
కానీ వెంట వెంటనే వచ్చిన ఈ రెండు సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో రవితేజ కు ఈ హీరోయిన్ పై నమ్మకం పోయిందట.
అంతేకాదు ఇంకొకసారి కాజల్ తో చేయకూడదు రా బాబు అని గట్టిగా నిర్ణయించుకున్నారట.ఆ తర్వాత ఓ సినిమాలో చిత్ర యూనిట్ కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నా కూడా ఆమెని వద్దని ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకున్నారట రవితేజ.

అలా ఎంతోమందికి హిట్ సినిమాలను అందించిన కాజల్ అగర్వాల్ రవితేజ కి మాత్రం ఫ్లాఫ్ సినిమాలను అందించింది.అయితే ఈ విషయం తెలిసిన కాజల్ అభిమానులు సినిమా ప్లాఫ్( Movie Flop ) అయితే హీరోయిన్ మీద భారం వేయడం ఏమాత్రం మంచిది కాదు.మీ సినిమా కథ సరిగ్గా ఎంచుకోక మా హీరోయిన్ మీద అబాండాలు వేయడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.







