తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తిక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్క లేదు.ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు దక్కింది.
మరి ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు జనాలలోకి ఈ విధంగా దూసుకెళ్లాయో మనందరికీ తెలిసిందే.అలాగే పిల్లల క్యారెక్టర్స్ అయినా హిమ, సౌర్య ల పాత్రలు కూడా బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
అయితే మొన్నటి వరకు ఈ సీరియల్ లో వీరు పెద్దవారు అవ్వడంతో యంగ్ ఆర్టిస్ట్ లను చూపించారు.కానీ ప్రస్తుతం మళ్ళీ సౌర్య, హిమ లను చూపిస్తున్నారు.
అయితే అద్భుతంగా నటించడం మాత్రమే కాకుండా డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాము అని మరోసారి నిరూపించారు సౌర్య, హిమ.ఇప్పటికే పలుసార్లు స్టార్ మా స్టేజ్ పై అ ఇద్దరు పిల్లలు డాన్స్ ను ఇరగదీసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసారు సౌర్య, హిమ లు.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మరొకసారి వీళ్ళు వారి డాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశారు.తాజాగా మా టీవీ యాజమాన్యం వారు నిర్వహించిన పరివార్ అవార్డ్స్ లో ఇద్దరూ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు.

వీరి డాన్స్ చూసిన బుల్లితెర ఆడియెన్స్ నటనలో కాదు,డాన్స్ లో కూడా స్టార్స్ అనిపించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం వీరి డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.కాగా ఆ వీడియోలో శౌర్య స్టార్ మా ని పొగుడుతూ స్టార్ మా పాట పై డ్యాన్స్ ను ఇరగదీసింది.
ఆ తరువాత హిమ వచ్చి కార్తీకదీపం లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా పాటకు స్టెప్పులను ఇరగదీసింది.ఇక ఇద్దరు చిన్నారులం డాన్స్ పెర్ఫార్మెన్స్ ని చూసిన కార్తీకదీపం సీరియల్ టీమ్ తో పాటు మిగిలిన సీరియల్ టీమ్స్ కూడా గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళ డాన్స్ పర్ఫామెన్స్ లకు విజిల్స్ వేసి ఎంజాయ్ చేశారు.







