కార్తీక దీపం డాక్టర్ బాబు భార్య ఎవరో తెలుసా...?

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా లో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ప్రసారమయ్యే "కార్తీక దీపం" సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 అంతేగాక ఇప్పటివరకు దాదాపుగా ఎక్కువ టిఆర్పి రేటింగ్ సంపాదించిన ధారావాహికలలో కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

అయితే ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ గురించి ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం.అయితే నిరూపమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జిల్లా పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగాడు.

నిరూపమ్ తండ్రి స్థానికంగా ఉన్నటువంటి ఓ రేడియో ఛానల్లో పని చేసేవాడు. దీంతో నిరూపమ్ కి నటన పట్ల ఆసక్తి పెరగడంతో కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ లో బాగానే పాల్గొనేవాడు.

ఆ తరువాత తెలిసిన వారి ద్వారా తెలుగు సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకొని ప్రస్తుతం బుల్లి తెరలో బాగానే రాణిస్తున్నాడు.అయితే నిరూపమ్ అప్పట్లో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే చంద్ర ముఖి అనే సీరియల్ లో హీరో గా నటించే సమయంలో ఇదే సీరియల్ లో హీరోయిన్ గా నటించిన మంజుల అనే సీరియల్ నటి ని ప్రేమించి ఇరువురి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

అయితే అప్పటికి మంజుల కూడా పలు తెలుగు సీరియల్స్ లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

అయితే నిరూపమ్ పారితోషికం విషయానికొస్తే ఒక్కో సీరియల్ ఎపిసోడ్ కి దాదాపుగా 25 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.అలాగే మంజుల కూడా  ఒక్కో  ఎపిసోడ్ కి దాదాపుగా 15 వేల రూపాయలు పారితోషకం తీసుకుంటోంది.

కాగా ప్రస్తుతం నిరూపమ్ తెలుగులో హిట్లర్, కార్తీకదీపం, ప్రేమ, తదితర ధారావాహికలలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పటికీ చాల మందికి బుల్లితెర ప్రేక్షకులని నిరూపమ్ కార్తిక్ గా, డాక్టర్ బాబుగానే తెలుసు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు