తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం( Karthika Deepam ) సీరియల్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుందని చెప్పాలి.స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి ఈ సీరియల్ ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో డాక్టర్ బాబు వంటలక్క పాత్రలు హైలెట్ గా నిలిచాయి.ముఖ్యంగా వంటలక్క దీప పాత్రలో నటించినటువంటి ప్రేమి విశ్వనాథ్( Premi Vishwanth ) తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ఈమెకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రసారమైనటువంటి కార్తీకదీపం సీరియల్ పూర్తి కావడంతో ఎంతో మంది నిరాశ వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఈ సీరియల్ కి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి దర్శకుడు కార్తీక దీపం 2 ( Karthika Deepam 2 ) సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా కార్తీకదీపం సీక్వెల్ రాబోతుందని తెలిసి అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ సీరియల్ మార్చ్ 25 నుంచి ప్రతి రోజు రాత్రి 8 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతుంది.
ఇక ఈ సీరియల్ లో కూడా డాక్టర్ బాబు వంటలక్క ఉండడంతో ఈ సీరియల్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం స్టార్ మాలో అత్యధిక రేటింగ్ కైవసం సొంతం చేసుకుని దూసుకుపోతుంది.ఇలా తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వంటలక్క క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఇంత పాపులారిటీ ఉన్నటువంటి ఈమెకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజు ప్రేమి విశ్వనాథ్ 35 వేల రూపాయల రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నారట.ఇలా నెలలో ఈమె దాదాపు 20 రోజులకి పైగా ఈ సీరియల్ షూటింగ్లో బిజీ అవుతున్నారని తెలుస్తోంది ఇలా రోజుకు 35000 అంటే నెలకు సుమారు 7 నుంచి 8 లక్షల వరకు ఈమె రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారనే విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.