కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ముత్తయ్య డైరక్షన్ లో వచ్చిన సినిమా విరుమన్.శుక్రవారం రిలీజైన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
కలక్షన్స్ కూడా బాగానే వస్తున్నట్టు తెలుస్తుంది.తమిళంలో ఈమధ్య కాలంలో స్టార్ సినిమాలు ఏవి లేకపోవడంతో విరుమన్ కి కలిసి వచ్చింది.
అయితే కార్తీ సినిమా అంటే అది ఖచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ కావాల్సిందే.కానీ విరుమన్ మాత్రం కేవలం తమిళంలోనే రిలీజ్ చేశారు.
కార్తీకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే విరుమన్ సినిమా లాంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి.
తెలుగు ఆడియెన్స్ కి ఇది రొటీన్ సినిమా అవుతుందని.విరుమన్ పల్లెటూరి నేపథ్యంతో వచ్చిన సినిమా ఆ సినిమాలో చాలా చోట్ల తమిళ సంప్రదాయాలు ప్రస్థావించారట.
అందుకే దాన్ని తెలుగులో డబ్ చేసినా వర్క్ అవుట్ కాదని లైట్ తీసుకున్నారట.కార్తీ విరుమన్ సినిమా తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం మణిరత్నం డైరక్షన్ లో పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు కార్తీ.తెలుగు తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నాడు కార్తీ.