తెలంగాణలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగబోతూ ఉండగా.ఏపీలో వచ్చే ఏడాది లో ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ఇప్పటి నుంచే పొత్తుల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే గెలుస్తామో అనే విషయాలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి.
ఇప్పటికే పొత్తుల రాయబారాలు మొదలయ్యాయి.అయితే ప్రస్తుతం కర్ణాటక( karnataka ) లో ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతోంది మే 10వ తేదీన అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
దీంతో అక్కడ జరగబోయే ఎన్నికలపై ఏపీ తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.కర్ణాటక గెలుపు కోసం కాంగ్రెస్ బిజెపిలు నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశాయి.
ప్రజలకు అనేక హామీలు ఇస్తూ గెలుపునకు మార్గాలు చుసుకుంటున్నాయి.

బీజేపీ కాంగ్రెస్( BJP ) అగ్రనేతలంతా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.ఇక్కడ రాబోయే ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో , ఈ స్థాయిలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉండబోతోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారుతాయి.ప్రస్తుతం కర్ణాటకలో అధికార బిజెపి, వివక్ష కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి రాబోతున్నట్లు అనేక సర్వే రిపోర్టులు వచ్చాయి.దీంతో తెలుగు రాష్ట్రాల్లో బిజెపితో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్న పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలని, తొందరపడి పొత్తులు ఖరారు చేసుకోకూడదనే ఆలోచనకు వచ్చాయట.ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసిపి తో పాటు, ప్రధాన ప్రతిపక్షం టిడిపి సైతం బిజెపి కి అనాధికారికంగా మిత్ర పక్షంగా కొనసాగుతున్నాయి.అధికారికంగా జనసేన, బిజెపి పొత్తు కొనసాగుతోంది.అధికారికంగా పొత్తు పెట్టుకుని జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో టిడిపి ఉంది.ఒకవేళ కర్ణాటక ఫలితాలు తేడా వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, టిడిపి వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది.అయితే టిడిపి తో పొత్తు కోసం బిజెపినే గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు.

జనసేన, టిడిపిని( Janasena ) కలుపుకు వెళ్లే విధంగా బిజెపి ప్రయత్నాలు చేసినా, ఆశ్చర్యపోనవసరం లేదు.ఇక తెలంగాణలో బిజెపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు కానీ, కర్ణాటక ఫలితాలు తేడా వస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తో పాటు, తెలంగాణ టిడిపితో పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు.మొత్తంగా చూస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల పై తీవ్రంగానే ప్రభావం చూపించబోతున్నాయి.







