లవ్ జిహాద్ పై మంత్రిగారు సంచలన వ్యాఖ్యలు

లవ్ జిహాద్ పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.దీనిపై కర్ణాటక మంత్రిగారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘లవ్‌ జిహాద్‌’పై తీవ్రమైన చర్చ నడుస్తోంది.కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ ‘‘లవ్‌ జిహాద్’‌ అనేది ఓ దుష్టశక్తి అని.ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదించిందని.

Karnataka Home Minister Comments On Love Jihad Karnataka Home Minister, Love Jih

త్వరలోనే చట్టం రూపొందిస్తామని వెల్లడించారు.ఉత్తరప్రదేశ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ మేరకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు.

మతాంతర వివాహాలకు విరుద్ధంగా చట్టాల రూపకల్పనకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉపక్రమిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ మాట్లాడుతూ.

Advertisement

లవ్‌ జిహాద్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.ఈ విషయం గురించి ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించాం.

ఆ నిర్ణయాల మేరకు కొత్త చట్టాన్ని రూపొందిస్తాం అని మంత్రిగారు అన్నారు.అంతేకాకుండా ‘అలహాబాద్‌ హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటకలో కూడా ఓ చట్టం తీసుకురాబోతున్నాం.

కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం అంగీకారం కాదు.ఇలాంటి చర్యలకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది అంటూ ఆయన హెచ్చరించారు.

అదే విధంగా.మరో ట్వీట్‌లో ముస్లిం యువకులను జిహాదీలతో పోల్చారు బొమ్మాయ్‌.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది.మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ నేపథ్యంలో అలహాబాద్ కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు