ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు నో పర్మీషన్..!

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కే.ఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 5 నుండి సమ్మె తలపెట్టాలని అనుకున్నారు.

అయితే ఈ సమ్మెకు ప్రభువం పర్మీషన్ ఇవ్వలేదు.మూడు నెలల క్రిత ఆర్టీసీ ఉద్యోగులు రెండు వారాలకు పైగా సమ్మె చేశారు.అప్పట్లో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది.

అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జాప్యం చేస్తుందని ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు.ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆర్టీసీ ఉద్యోగులు జూలై 5 నుండి సమ్మెకి వెళ్లాలని అనుకున్నారు.

అయితే అధికారికంగా ప్రకటించలేదు కాని దాదాపు సమ్మెకి అంతా సిద్ధం అయ్యారు.అయితే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

Advertisement

అత్యవసర సమ్మె నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలాంటి సమ్మెలు చేయవద్దని నిషేధించింది.

రవాణా సిబ్బంది సమ్మెని నిషేధించింది.గడిచిన 15 నెలల్లో 8 నుండి 10 నెలల పాటు రవాణా సక్రమంగా కొనసాగలేదని ఇప్పటికే వ్యవస్థ ఆర్ధికంగా దెబ్బతిన్నదని మరోవైపు కొవిడ్ వల్ల ప్రయాణీకులు కూడా పెద్దగా రావడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకు దిగితే మరింత నష్టమని ప్రభుత్వం వెల్లడించింది.

కీలక నేతలు, కొడిహళ్లి చంద్రశేఖర్ తో కలిసి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.అయితే ప్రభుత్వం ఈ లోగా వారి సమ్మెని నిషేధిస్తూ కంపల్సరీగా పనిచేయాలని నిర్ణయించింది.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు