కర్ణాటకలో హంగ్ ఏర్పడితే బీజేపీ ఆ సాహసం చేయక పోవచ్చు!

దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) ముగిసాయి.ఓటర్లు తమ యొక్క నిర్ణయాన్ని ఈవీఎంలలో భద్రపరిచారు.

చెదురుమొదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరిపినప్పటికీ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.అధికార బిజెపి ( BJP ) మళ్లీ గెలిచినందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.

ఎన్నికల పూర్తికాక ముందే కుమారస్వామి( Kumaraswamy ) మీడియా సమావేశంలో డబ్బు పంచడంలో మేము విఫలమయ్యాం.ఇతరులతో పోటీ పడలేక పోయాం అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇక ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ సర్వే( Exit Polls Results ) ఫలితాలు వచ్చాయి.ప్రముఖ జాతీయ స్థాయి మీడియా సంస్థలతో పాటు కర్ణాటక కి చెందిన పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సర్వే ను నిర్వహించడం జరిగింది.

Advertisement

ఆ సర్వే లో కాంగ్రెస్ కి( Congress ) అధికారం దక్కే అవకాశం ఉంది అన్నట్లుగా తేలింది అంటూ కొన్ని మీడియా సంస్థలు పేర్కొనగా, బిజెపి మీడియా సంస్థలు గా పేరు పడ్డ కొన్ని మీడియా సంస్థలు మాత్రం కర్ణాటక లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటూ తేల్చి చెప్పడం జరిగింది.ఒక వేళ కర్ణాటకలో హంగ్‌ ఏర్పడితే గతంలో మాదిరిగా బిజెపి రాజకీయ చతురతను ప్రదర్శించి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అంటూ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అత్యధిక సీట్లు సొంతం చేసుకున్న పార్టీ గా కాంగ్రెస్ పార్టీ నిలిచినా కూడా బిజెపి అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అయితే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సంవత్సరం లో జరగబోతున్నాయి.ఇలాంటి సమయం లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశ వ్యాప్తంగా కూడా బిజెపి పై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అందుకే కర్ణాటక లో స్పష్టమైన మెజార్టీ వస్తే తప్పితే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేను లాక్కునేందుకు ప్రయత్నించకపోవచ్చు.ఆ తర్వాత అంటే వచ్చే సంవత్సరం జరగబోతున్న పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల తర్వాత కర్ణాటకలో ఏమైనా రాజకీయ బల ప్రయోగం ఉంటుందేమో చెప్పలేము.

కానీ ఇప్పటికి ఇప్పుడు మాత్రం బిజెపి కర్ణాటకలో తమ మార్కు రాజకీయాన్ని ప్రదర్శించకపోవచ్చు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు