కర్కాటక రాశి వారికీ మార్చి నెలలో ఎలా ఉంటుందో తెలుసా? ఈ నెల మొత్తం కర్కాటక రాశి వారికి అదృష్ట నెలగా చెప్పవచ్చు.ఆర్ధిక పరంగా,కెరీర్ పరంగా,ఆరోగ్యపరంగా,కుటుంబ సంబంధాల విషయంలో ఈ నెలలో మంచి పురోగతిని సాధిస్తారు.
ఈ నెలలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు.మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక గత నెలలో వచ్చిన అడ్డంకులు అన్ని కూడా ఈ నెలలో తొలగిపోతాయి.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు అయితే వారికీ సానుకూలంగా ఈ నెల ఉంటుంది.
మీ కెరీర్ పరంగా చూసిన ఈ నెల మీకు బాగా కలిసివస్తుంది.
ఆ నెలలో వచ్చే ఫలితాలను అందిపుచ్చుకోకపోతే ఇలాంటివి మీ జీవిత కాలంలో చాలా అరుదుగా అందుతాయి.మీరు వ్యాపారస్తులు అయితే ఈ నెల అంతా బంగారు కాలంగా చెప్పవచ్చు.
వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఈ నెల మంచిది.అలాగే మీ పోటీదారుల మీద విజయాన్ని సాధిస్తారు.
అంతేకాక కొత్త వ్యాపారం ప్రారంభించటానికి కూడా ఈ నెల బాగుంటుంది.భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు ఈ నెలలో పూర్తి అవుతాయి.అలాగే కొత్త ప్రాజెక్ట్ లను అందిపుచ్చుకుంటారు.అంతేకాక నూతన బాగస్వామ్య ప్రాజెక్ట్ లను ప్రారంభించటానికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు.
కుటుంబంతో హ్యాపీగా ఉంటారు.అలాగే ఇంటిలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.పిల్లలకు వివాహ ప్రయత్నాలు మొదలు మంచి ఫలితాలను ఇస్తాయి.విదేశీ ప్రయాణాలకు కూడా సానుకూలంగా ఉంటుంది.
ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు చాలా బలంగా ఉంటారు.అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవటం కూడా మంచిది.
ఈ నెలలో చేసే ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి.ప్రయాణ సమయంలో కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతారు.విదేశీ ప్రయాణాలు మీరు ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలను అందిస్తాయి.ఈ నెలలో మీరు ఎవరికైనా అప్పు ఇవవటం కానీ,
మీరు ఎవరి దగ్గర నుండి అయినా అప్పు తీసుకోవటం అంత మంచిది కాదు.
ఈ నెలలో ఆదాయం ఎక్కువగాను,వ్యయం తక్కువగాను ఉంటుంది.ఈ నెలలో ఆర్ధికంగా చాలా బాగుంటుంది.
ఈ నెలలో మంగళ,శనివారాల్లో శివుణ్ణి,దుర్గా దేవిని పూజించాలి.