తెలుగు ప్రేక్షకులకు నటి , బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరాటి కళ్యాణి సినిమాల్లో ద్వారకంటే కాంట్రవర్సీల ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు.
మొన్నటికి మొన్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి విషయంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే చాలా మందికి కరాటే కళ్యాణి పేరు వినగానే కృష్ణా సినిమాలోని బాబీ అన్న డైలాగ్ గుర్తుకు వస్తూ ఉంటుంది.
అయితే చాలామంది గతంలో కరాటే కళ్యాణి నటించిన పాత్రలు సినిమాల గురించి మాట్లాడుతూ ఆమెను చులకనగా అసభ్య కరంగా మాట్లాడారు.
సినిమాలలోని క్యారెక్టర్ నీ పోలుస్తూ వ్యక్తిగతంగా కూడా ఆమె క్యారెక్టర్ పై విమర్శలు గుప్పించారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి ఇదే విషయంపై మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం బతకడం కోసం మాత్రమే అటువంటి క్యారెక్టర్లలో నటించాననీ, కానీ తనది అటువంటి క్యారెక్టర్ కాదు అని తెలిసింది.
అయితే తన గురించి పబ్లిక్ లో అనుకుంటున్నా మాటలను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయింది.అనంతరం వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.వైవాహిక.జీవితంలో నేను ఎన్నో బాధలను అనుభవించాను.
నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి తాగే బేగంపేటలో నడిరోడ్డుపై నా పైట లాగాడు.అంతేకాకుండా గొడవలు తాగి వచ్చి కొట్టడం ఇవన్నీ చూసిన మాత్రం పెళ్లి అంటేనే అవసరం లేదని అనిపించింది.
భర్తను గౌరవించాలి కాబట్టి వాటన్నిటి వాటిని భరించాను.

అర్ధరాత్రి 2 గంటలకు తాగేసి వచ్చి వండి పెట్టమన్నా పెట్టేదాన్ని.కానీ, నా లైఫ్‌లో మ్యారేజ్ కలిసిరాలేదు అంటూ కరాటే కళ్యాణి ఎమోషనల్ అయ్యింది.అనంతరం బయట జనాలు తన గురించి మాట్లాడుకునే మాటలపై స్పందిస్తూ.
ఆ మాటలు తనను ఎంతగానో బాధిస్తాయని, నా బాధ ఏంటో బయటవాళ్లకు తెలీదు.నా వెనక ఏం జరుగుతుందో కూడా తెలీదు.
నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలీదు.తినకుండా ఉన్న స్థాయి నుంచి ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదిగాను.
కానీ, బయట జనం ఈజీగా ఒక మాట అనేస్తారు.ఒక వ్యభిచారిని అన్నట్టు మాట్లాడతారు.
ఏరోజూ నేను అలాంటి పనులు చేయలేదు.ఏరోజూ నేను అలా ప్రవర్తించలేదు.
అంత నీచమైన మాటలు మాట్లాడితే నాకు లోపల నుంచి ఏడుపు వచ్చేస్తుంది.అలాంటప్పుడు నేను ఒంటరితనం ఫీలవుతాను.
నాకు సపోర్ట్ ఎవరూ లేరే అనిపిస్తుంది.కానీ నన్ను చూసి భయపడేవాళ్లే తప్ప నన్ను అర్థం చేసుకునేవాళ్లు లేరు అని కరాటే కళ్యాణి కంటతడి పెట్టుకున్నారు.







