ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.ప్రేక్షకులు స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలను చూడటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు.
చిన్న సినిమా అయినా కొత్త హీరో అయినా సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆ సినిమాలను ఆదరిస్తున్నారని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి.ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో భూతకోల నృత్యం నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా కన్నడ నాట అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఇతర భాషలలో కూడా విడుదల చేశారు.అయితే అన్ని భాషలలో కాంతార సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే హోం భలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ 16 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా మరొక రికార్డు సాధించింది.ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో దిగడం అందరిని సంతోషానికి గురి చేసింది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరగందుర్ తెలియజేస్తూ కాంతార సినిమా రెండు కేటగిరీలలో ఆస్కార్ నామినేషన్ లో నిలిచిందని తెలియజేశారు.
ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో నిలిచేలా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా బెస్ట్ ఫిలిమ్,బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలలో ఆస్కార్ నామినేషన్ లో నిలిచిందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







