నిర్మాతకు హీరో డైరెక్ట్ వార్నింగ్.. కనిపించకుండా పోతావ్ అంటూ!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక,నిర్మాతల మధ్య లేదంటే హీరో దర్శకనిర్మాతల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.అయితే కొన్ని కొన్ని సార్లు అవి చిలికి చిలికి గాలి వానగా కూడా మారుతూ ఉంటాయి.

 Kannada Actor, Producer, Darshan, Threaten Legal Action-TeluguStop.com

ఇప్పటికే అలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు జరిగిన విషయం తెలిసిందే.ఇప్పటికీ పలువురి హీరోలకు దర్శక నిర్మాతలకు మాటలు కూడా లేవు.

అయితే తాజాగా కూడా ఒక నటుడు నిర్మాతపై కోప్పడమే కాకుండా కనిపించకుండా పోతావు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.దీంతో సదర నిర్మాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు సదరు నటుడు పై విచారణ జరుపుతున్నారట.

పూర్తి వివరాల్లోకి వెళితే.నటుడు దర్శన్ పై ఒక నిర్మాత కెంగేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇందుకు గల కారణం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అనే పేరుతో భరత్ అనే వ్యక్తి సినిమాను తీస్తున్నారు.పెళ్లిళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో విలన్ పాత్రలో ధ్రువన్ నటిస్తున్నారు.

అయితే రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్రీకరణకు ఆలస్యం అయిందని ధ్రువన్‌ వద్ద భరత్‌ వాపోయాడు.

Telugu Bharath, Darshan, Kannada, Threaten-Movie

అయితే ధ్రువన్‌ ఇదే విషయాన్నీ చెప్పటానికి దర్శన్‌కు ఫోన్‌ చేశాడట.అదే సమయంలో ఫోన్‌లో నిర్మాతను బెదిరించినట్లు భరత్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో పోలీసులు ఎన్‌సీఆర్‌ను నమోదు చేసుకున్నారు.

ఇందుకు సంబంధించి దర్శకుడు ఆంథోని, అలాగే కెమరామ్యాన్‌ లను కూడా స్టేషన్‌కు పిలిపించి విచారించారు.అయితే నటుడు దర్శన్‌ మాట్లాడిన ఆడియో సోషల్‌ వీడియాలో వైరల్‌గా మారింది.

నీవు ఉండవు.ఏమైనా చేయాలంటే చెప్పే చేస్తా.

రెడీగా ఉండండి, నీవు కనపడకుండా పోతావు అని ఆడియోలో ఉంది.ఈ ఆడియోలోని ధ్వని దర్శన్‌గా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube