Chetan Kumar : హిందుత్వంపై అభ్యంతరకరంగా కామెంట్లు చేసిన ప్రముఖ నటుడు.. చివరకు?

Kannada Actor Chetan Kumar Ahimsa Arrested For Objectionable Tweet On Hindutva

ఇటీవల కాలంలో చాలామంది హిందూ మతం పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే రోజు రోజుకి హిందూ మతం పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది అంటూ హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 Kannada Actor Chetan Kumar Ahimsa Arrested For Objectionable Tweet On Hindutva-TeluguStop.com

ఇప్పటికే చాలామంది ఇలా హిందూ మతంపై నెగటివ్ కామెంట్స్ చేసి వార్తలు నిలిచిన విషయం తెలిసిందే.ఇటీవలె భైరి నరేష్( Bhairi Naresh ) అయ్యప్పను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసి వారి ఆగ్రహానికి గురయ్యాడు.

తాజాగా ఈ జాబితాలోకి ఒక నటుడు చేరారు.హిందూ మతం పై అభ్యంతర కామెంట్స్ చేసి వివాదానికి తెరలేపాడు.

ఆ నటుడు మరెవరో కాదు కన్నడ పరిశ్రమకు చెందిన చేతన్ కుమార్( Chetan Kumar ) అహింస.హిందూమతాన్ని, హిందువుల మత విశ్వాసాలను అవమానించేలా కామెంట్లు చేశాడు.అలాగే కులాల మధ్య శత్రుత్వం పెరిగేలా వ్యాఖ్యలు చేశాడు.హిందుత్వ అనేది అబద్ధం మీద నిర్మించబడిందని ఆరోపిస్తూ సంచలన ట్వీట్ చేసాడు.ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో టాపిక్ గా మారింది.కాగా తాజాగా బెంగళూరు( Bangalore ) పోలీసులు చేతన్ కుమార్ అహింసను అరెస్ట్ చేశారు.

బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుని అనంతరం అతన్ని జిల్లా కోర్టుకు తరలించారు.ఈ నటుడు కూడా హిందువే, దళితుడు అలాగే గిరిజన కార్యకర్త కూడా.

అలాంటిది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు, కులాల మధ్య శత్రుత్వం పెంచేలా కామెంట్స్ చేసినందుకు చేతన్ పై చాలా కేసులు నమోదు అయ్యాయి.చేతన్ కుమార్ మార్చి 20న చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో వివాదానికి తెరలేపింది.కాగా చేతన్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి, అయోధ్య కు తిరిగి చేరుకున్న తర్వాత భారతదేశ జాతి ప్రారంభమైంది అనేది ఒక అబద్ధం.1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం.2023: ఉరిగౌడ,నంజిగౌడ( Urigowda, Nanjigowda ) కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది ఒక అబద్ధం అంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు.అంతేకాదు హిందుత్వం అనేది సత్యం చేత ఓడించబడుతుంది అంటూ కామెంట్స్ చేసాడు చేతన్.అయితే చేతన్ కుమార్ సోషల్ మీడియాలో ఈట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆ హిందూ సంస్థల వారు చేతన్ కు వ్యతిరేకంగా శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నటుడి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube