అలాంటి వారే ఇలాంటి వారికి జన్మ నిస్తారు అంటూ నిప్పులు చేరిగిన బ్యూటీ

నిర్భయ దోషులను మన్నించాలి అంటూ కోరిన లాయర్ ఇందిరా జైసింగ్ పై బాలీవుడ్ నటి కంగనా రౌనత్ తీవ్ర స్థాయిలో మండిపడింది.ఇటీవల లాయర్ ఇందిరా జైసింగ్ సోనియా గాంధీ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నిర్భయ దోషులను మన్నించాలి అంటూ సంచలన సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Kangana Ranauth Commentson Indira Jaisingh-TeluguStop.com

అయితే ఆమె సలహా పై నిర్భయ తల్లి కూడా స్పందించి వారు మరణిస్తేనే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది అంటూ నిరాకరించింది.అయితే ఇదే అంశం పై తాజాగా కంగనా స్పందిస్తూ జైసింగ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఒక నాలుగు రోజుల పాటు ఆమెను కూడా ఆ దోషుల తో పాటు జైల్లో పెట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా ఇలాంటి మహిళలే అలాంటి రేపిస్టులకు, కామాంధులకు, హంతకులకు జన్మ నిస్తారు అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.బస్సులో వెళుతున్న నిర్భయ పై అత్యంత పైశాచికంగా నిందితులు ప్రవర్తించిన తీరు అందరినీ కలచి వేసింది.

అలాంటి ఘోరానికి పాల్పడిన నిందితులకు 7 సంవత్సరాల తరువాత ఉరిశిక్షలు ఖరారు చేయగా దానికి సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వారిని క్షమించాలి అంటూ నిరుబ్బయ తల్లికి సలహా ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube