చంద్రముఖి( Chandramukhi ) అనే టైటిల్ విన్న వెంటనే మన కళ్ల ముందు హీరోయిన్ జ్యోతిక మెదులుతుంది.చంద్రముఖి సినిమాకు ముందు తర్వాత చాలామంది ఈ పాత్రలో నటించినా వాళ్లెవరూ జ్యోతిక( Jyothika ) స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయారు.
చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కి చాలా సంవత్సరాల క్రితం విడుదలైన నాగవల్లి సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఫెయిలైంది.

ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో నటించిన రిచా గంగోపాధ్యాయ( Richa Gangopadhyay ) ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు.లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో వాసు డైరెక్షన్ లో చంద్రముఖి2 సినిమా తెరకెక్కగా ఈ నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కంగనా తాజాగా మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన మూడో మూవీ చంద్రముఖి2( Chandramukhi 2 ) అని అన్నారు.తాను గతంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాను చూశానని ఆ సినిమాలో జ్యోతిక నటన ఎంతగానో నచ్చిందని కంగనా రనౌత్ వెల్లడించారు.
జ్యోతిక నాకు స్పూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు.అయితే జ్యోతికతో తనను పోల్చుకోవద్దని కంగనా కామెంట్లు చేశారు.

నేను నటించిన రోల్ మాత్రమే అసలైన చంద్రముఖి అని కంగనా అన్నారు.కామెడీ, హర్రర్, ఫ్యామిలీ, ఇలా అన్ని అంశాలు ఉన్న సినిమాలో నటించడం సంతోషంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు.చంద్రముఖి2 చిత్ర యూనిట్ తో కలిసి నటించడం మంచి అనుభవం అని ఆమె అన్నారు.కంగనా రనౌత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్( Kangana Ranaut ) ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.







